చదువులో, లవ్ లో, బిజినెస్ లో ఫెయిల్ అవ్వాలని చెప్పిన హర్షవర్ధన్.. ఎందుకంటే?

అమృతం సీరియల్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న నటులలో హర్షవర్ధన్ ఒకరు.ఆ సీరియల్ కు పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ఒక ఇంటర్వ్యూలో హర్షవర్ధన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తాను టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాయని నాన్న లెక్చరర్ అని హర్షవర్ధన్ అన్నారు.రిజల్ట్ చూసి తాను బ్లాంక్ అయ్యానని హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు.

 Actor Harshavardhan Interesting Comments Over Life, Harsha Vardhan, Interesting-TeluguStop.com

పిల్లలను పిల్లల్లా చూడాలని వాళ్లను చైల్డ్ హుడ్ ను ఎంజాయ్ చేయనివ్వాలని హర్షవర్ధన్ తెలిపారు.

తన పర్సనల్ ఒపీనియన్ ప్రకారం బాహుబలి కంటే ఈగ ఇష్టమని ఆ సినిమాలో గుడ్డు దశలో నుంచి ఈగ రెక్కలు తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో రాజమౌళి పది నిమిషాలు చెబుతాడని రెక్కలు అంటుకుని ఉన్న ఈగ పుట్టుకను ఎంతో అద్భుతంగా చూపించారని హర్షవర్ధన్ పేర్కొన్నారు.తల్లిదండ్రులు చదువు చదువు అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారని హర్షవర్ధన్ తెలిపారు.

పదో తరగతి ఫెయిల్ అయ్యాక నాన్నతో డబ్బులు తీసుకుని సినిమాకు వెళ్లానని హర్షవర్ధన్ వెల్లడించారు.

Telugu Amrutham Serial, Harshavardhan, Love, Tenth-Movie

యాక్టర్ కు ఉన్న అదృష్టం ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్లినా అక్కడ ఎవరూ తెలియకపోయినా గుర్తుపడతారని ఏ ఇబ్బంది ఎదురైనా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారని నాన్న తనతో చెప్పారని హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు.ఎప్పుడైతే నెగిటివ్ థింకింగ్ వస్తే బ్రేక్ తీసుకోవాలని నాన్న సూచించేవారని హర్షవర్ధన్ పేర్కొన్నారు.

Telugu Amrutham Serial, Harshavardhan, Love, Tenth-Movie

తాను ఎక్కడికి వెళ్లినా అమృతం అని పిలుస్తారని హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు.బాగున్న రోజు బాగుందని బాలేని రోజు బాలేదని అనుకోకూడదని హర్షవర్ధన్ అన్నారు.లవ్ లో, చదువులో, వ్యాపారంలో ఫెయిల్ అవ్వాలని ఫెయిల్ అయ్యాక లైఫ్ లో కిక్ తెలుస్తుందని శత్రువులు, మిత్రులు ఎవరో కూడా తెలుస్తుందని హర్షవర్ధన్ పేర్కొన్నారు.

పడిన తర్వాత ఎలా ఎదిగామనేది ముఖ్యమని హర్షవర్ధన్ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube