కూతురి ప్రేమలో పడి అలా చేస్తున్న హరితేజ భర్త.. ఏం జరిగిందంటే..?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో ఆ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు సంబంధించిన ఎవరికీ తెలియని టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. బిగ్ బాస్ సీజన్ 1కు ముందు సీరియల్ నటిగా గుర్తింపును సంపాదించుకున్న హరితేజ బిగ్ బాస్ షో ద్వారా తన ఇమేజ్ ను పూర్తిగా మార్చుకున్నారు.

 Actor Hariteja Shares An Interesting Video Of Her Daughter And Husband, Hariteja-TeluguStop.com

ఫలితంగా బిగ్ బాస్ షో తర్వాత హరితేజకు ఊహించని స్థాయిలో ఆఫర్లు పెరుగుతుండటం గమనార్హం.

ఒకవైపు టీవీ, సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న హరితేజ కుటుంబానికి కూడా తగిన ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే.

కొన్నిరోజుల క్రితం హరితేజ పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడంతో పాటు ఆ పాపకు భూమి దీపక్ రావు అని పేరు పెట్టారు.అయితే హరితేజ భర్త దీపక్ పాపను ఆడిస్తూ పాపతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.

కొన్నిసార్లు పాప చేతిలో లేకపోయినా పాప ఉన్నట్టు ఆడిస్తూ దీపక్ రవు భ్రమ పడ్డారు.

హరితేజ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ వీడియోను షేర్ చేయగా వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.హరితేజ వీడియోను షేర్ చేయడంతో పాటు డాడీ ఆన్ డ్యూటీ అంటూ కామెంట్ పెట్టారు.బిగ్ బాస్ షో తర్వాత హరితేజకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎక్కువగా వస్తున్నాయి.

అఆ సినిమాలో హరితేజ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం గమనార్హం.హరితేజ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

హరితేజ కూచిపూడి నృత్యకారణి కూడా కావడం గమనార్హం.తెలుగులో ఉన్న అన్ని ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో హరితేజ టీవీ షోలు, సీరియల్స్ చేయడం గమనార్హం.ఈ ఏడాది విడుదలైన అల్లుడు అదుర్స్, జాంబీ రెడ్డి సినిమాలలో హరితేజ నటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube