ప్రియురాలిని తుపాకితో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్న నటుడు  

Actor Hagen Mills Erica Price - Telugu Actor Hagen Mills Shoots Girlfriend, Hollywood, Kills Self In Murder-suicide, Lock Down, Murder

అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువగా ఉంటుంది.అక్కడ చాలా మంది సింపిల్ గా హత్యలు చేసేస్తూ ఉంటారు.

 Actor Hagen Mills Erica Price

అలాగే జాత్యాహంకార హత్యలు కూడా ఎక్కువగా ఉంటాయి.అలాగే చిన్న చిన్న గొడవలకి అక్కడి వారు కాల్పులు జరుపుకునేంత వరకు వెళ్ళిపోతారు.

ఇప్పుడు అలాగే అమెరికాలో ఓ నటుడు తన ప్రియురాలి మీద విచక్షణారహితంగా కాల్పులకి తెగబడి తను కూడా కాల్చుకొని చనిపోయాడు.ఈ ఘటన కెంటకీలో చోటు చేసుకుంది.

ప్రియురాలిని తుపాకితో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్న నటుడు-General-Telugu-Telugu Tollywood Photo Image

హ్యాగెన్ మిల్స్ అనే నటుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

ప్రియురాలు ఎరికా ప్రైస్ ఛాతీలోకి తుపాకీతో కాల్చిన హ్యాగెన్ ఆ తర్వాత తన తలలోకి కాల్చుకున్నాడు.

దీంతో, అతను అక్కడికక్కడే మరణించాడు.మరోవైపు ఎరికా పరిస్థితి విషమంగా ఉంది.

ఆమె చేయి, ఛాతిపై తీవ్ర గాయాలయ్యాయి.కాల్పుల ఘటన జరిగిన సమయంలో వారి నాలుగేళ్ల కూతురు కూడా అక్కడే ఉంది.

హ్యాగెన్ కు అమెరికాలో మంచి ప్రేక్షకాదరణ ఉంది.బాస్కెట్ వెబ్ సిరీస్ లో అద్భుతమైన నటనతో ఆయన ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

టీవీ సీరియళ్లు, రెండు హాలీవుడ్ సినిమాలలో కూడా అతను నటించాడు.అయితే వారి మధ్య గొడవ కారణంగానే హ్యాగెన్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actor Hagen Mills Shoots Girlfriend Kills Self In Murder Suicide Related Telugu News,Photos/Pics,Images..