భార్యకు కారును బహుమతిగా ఇచ్చిన ప్రముఖ నటుడు.. ఖరీదెంతంటే?

భర్తలపై భార్యలకు ఉండే ప్రేమను తెలియజేసే పండుగను కర్వా చౌత్ అని అంటారు.మనకు పెద్దగా తెలియకపోయినా నార్త్ ఇండియాకు చెందిన వాళ్లు ఘనంగా జరుపుకునే పండుగలలో కర్వా చౌత్ కూడా ఒకటి.

 Actor Govinda Gifts Wife Sunita Ahuja Bmw Car Karwa Chauth-TeluguStop.com

కర్వా చౌత్ జరుపుకునే టైమ్ లో భార్యలు భర్త ఆరోగ్యంగా ఉండాలని ఉపవాసం చేస్తారు.భర్తపై ఉండే ప్రేమను తెలియజేయడం కోసం భార్యలు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది.

దీపావళి పండుగకు కొన్ని రోజుల ముందు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది.ఈ పండుగ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన గోవింద అతని భార్య సునీత ఆహుజాకు ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారు.

 Actor Govinda Gifts Wife Sunita Ahuja Bmw Car Karwa Chauth-భార్యకు కారును బహుమతిగా ఇచ్చిన ప్రముఖ నటుడు.. ఖరీదెంతంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.భార్యకు బహుమతిగా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారుతో దిగిన ఫోటోలను గోవింద అభిమానులతో పంచుకున్నారు.

తన భార్య తన ప్రాణ స్నేహితురాలు అని జీవిత భాగస్వామి అని ఇద్దరు అందమైన పిల్లలకు తల్లి అని గోవింద చెప్పుకొచ్చారు.

Telugu Actor Govinda, Bmw Car, Bollywood, Costly Gift, Gifts New Car, Govinda Wife, Govinda Wife Sunitha Ahuja, Karwa Chaut, One Crore Rupees-Movie

భార్యపై తనకు ఉండే ప్రేమ వెల కట్టలేనిదని గోవింద పేర్కొన్నారు.గోవింద కొనుగోలు చేసిన ఈ కారు ధర కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం పండుగ జరుపుకుని అభిమానులతో ఫోటోలను పంచుకున్నారు.

Telugu Actor Govinda, Bmw Car, Bollywood, Costly Gift, Gifts New Car, Govinda Wife, Govinda Wife Sunitha Ahuja, Karwa Chaut, One Crore Rupees-Movie

పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త రావాలని కోరుకుంటూ కర్వా చౌత్ పండుగను జరుపుకుంటారు.ఈ ఏడాది 24, 25 తేదీలలో కర్వాచౌత్ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.ఏడాదిలో రెండు రోజుల పాటు కర్వాచౌత్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది.ఈ పండుగను జరుపుకోవడం వల్ల కుటుంబ సభ్యులు సైతం క్షేమంగా ఉంటారని మహిళలు నమ్ముతారు.సౌత్ ఇండియాలో కూడా కొంతమంది ప్రజలు ఈ సాంప్రదాయంను పాటిస్తూ ఉండటం గమనార్హం.

#Govinda #Govinda #GovindaSunitha #Gifts Car #BMW Car

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube