అప్పుడు విలన్ పాత్రల్లో నటించకపోతే ఇప్పుడు నేను ఉండేవాన్ని కాదు.. గోపీచంద్!

సినీ ఇండస్ట్రీలో కెరీర్ మొదట్లో విలన్ పాత్రలో నటించి ఆ తర్వాత హీరోగా మారిన వారు ఎంతో మంది ఉన్నారు.అలాంటివారిలో శ్రీకాంత్,మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు.

 Actor Gopichand Open Comments About Why He Played Villion Roles In Movies , Gopi-TeluguStop.com

అలా విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు గోపీచంద్. మొదట తొలివలపు సినిమా తో హీరో గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తరువాత వచ్చిన జయం సినిమాలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కూడా నిజం వర్షం లాంటి సినిమాలలో విలనిజాన్ని చూపించి ప్రతినాయకుడి పాత్రలో కూడా మెప్పించాడు గోపిచంద్.

ఆ తర్వాత యజ్ఞం సినిమాతో హీరోగా అలరించగా ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో విలన్ పాత్రలకు స్వస్తి చెప్పి అప్పటినుంచి హీరో పాత్రలకే పరిమితం అయ్యాడు గోపీచంద్.

ఇకపోతే హీరో గోపీచంద్ తాజాగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్.ఇందులో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై 1న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.

Telugu Gopichand, Maruthi, Pakka, Tollywood-Movie

ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్ విలన్ పాత్రలు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.గోపీచంద్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం నిర్మాత ఏ నాగేశ్వరరావు అని, ముందుగా గోపీచంద్ పై తొలివలపు సినిమా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య సందేహం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.అయితే ఇప్పటి వరకూ తాను చేసిన యజ్ఞం, రణం, సాహసం, లౌక్యం, శంఖం వంటి సినిమా టైటిల్స్ సెంటిమెంట్ పెట్టినవి కాదని తెలిపారు.అలాగే విలన్ పాత్రలు అనేది కేవలం అప్పుడున్న పరిస్థితుల కారణంగా మాత్రమే చేయాల్సింది వచ్చింది అని చెప్పుకొచ్చారు గోపీచంద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube