బాలీవుడ్ లో పుష్ప నటుడు ఎంట్రీ.. ఎవరంటే?

కరోనా సమయంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లలో వచ్చిన జోజి, కార్బన్, జన్‌ ప్రకాశన్‌, కుంబలంగి నైట్స్‌, సూపర్‌ డీలక్స్‌ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన మొట్టమొదటిసారి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో విలన్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు.

 Fahadha Faasil, Tollywood, Actor, Bollywood, Entry,latest News-TeluguStop.com

తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ నటుడి పై బాలీవుడ్ దర్శకుల కన్ను పడిందని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే ఈ నటుడికి బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే కొందరు దర్శక నిర్మాతలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు బీ టౌన్ సమాచారం.అయితే ఈయన బాలీవుడ్ అవకాశాలను అందుకుని బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Telugu Bollywood, Fahadha Faasil, Tollywood-Movie

తాజాగా ఈయన నటించిన మాలిక్‌ అనే చిత్రం ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది.ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు గురించి మాట్లాడుతూ తనకు ఒక మంచి స్నేహితుడు ఎప్పుడు ఎవరికి ఏం కావాలో తెలుసుకుని సినిమా కోసం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.ఇక పుష్ప సినిమాలో తాను నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే అయితే ఆ సినిమాలోని తన పాత్ర ఎలా ఉండబోతుందో చూడటానికి తను కూడా ఎంతో ఆతృతగా ఉన్నాడని ఈ సందర్భంగా వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube