'దివ్య'మైన పలుకులు : బాబు తంతే రోజా అక్కడికేనట !  

  • టీడీపీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నటి దివ్యవాణి తన రాజకీయ పలుకులకు పదునుపెట్టింది. తాజాగా ఆమె సినీ నటి రోజా మీద సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. నాలుగేళ్లు ఎమ్మెల్యేగా చేసిన రోజానే ఎగిరెగిరి పడితే 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఎలా మాట్లాడాలని రోజాపై దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు తంతే రోజా పాతాళ లోకానికే వెళ్తారని వ్యాఖ్యానించారు. రోజా ఔట్ డేటెడ్ నాయకురాలని దివ్యవాణి అన్నారు. ఆవిడ నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆమెకు పరాభవం దివ్యవాణి విమర్శలు చేశారు.

  • Actor Divyavani Senstional Coments On Ysrcp Mla Roja-

    Actor Divyavani Senstional Coments On Ysrcp Mla Roja

  • ఇక జగన్‌పై జరిగిన కత్తి దాడిని ప్రస్తావిస్తూ కోడి కత్తి డ్రామాలాగానే రేపు చేప ముల్లు డ్రామా కూడా వైసీపీ నేతలు అడతారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పసుపు-కుంకుమ’ కార్యక్రమానికి రోజా అనుకూలమా వ్యతిరేకమా? చెప్పాలని డిమాండ్ చేశారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే వైసీపీకి ఎందుకు కడుపుమంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ డబ్బులు ఇచ్చి మరీ పరిటాల కుటుంబంపై బురద జల్లుతుందని, వాటిని తాము తిప్పి కొడతామని దివ్యవాణి వ్యాఖ్యానించారు.