ఈ స్టార్ కమెడియన్ దశ తిరిగినట్టే.. సలార్ మూవీలో ఫుల్ లెన్త్ రోల్!

బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.ఈ సినిమా హిట్ తర్వాత ఈయనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కట్టారు.

 Actor-comedian Sapthagiri To Share Screen Space With Prabhas Details, Prabhas, Salaar, Prashanth Neel, comedian Sapthagiri, Comedian Sapthagiri In Salaar, Director Prasanth Neel, Salaar Movie Update-TeluguStop.com

దీంతో డార్లింగ్ వరుస సినిమాలు లైన్లో పెట్టాడు.అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలు విజయం సాధించక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

ఇక ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

 Actor-Comedian Sapthagiri To Share Screen Space With Prabhas Details, Prabhas, Salaar, Prashanth Neel, Comedian Sapthagiri, Comedian Sapthagiri In Salaar, Director Prasanth Neel, Salaar Movie Update-ఈ స్టార్ కమెడియన్ దశ తిరిగినట్టే.. సలార్ మూవీలో ఫుల్ లెన్త్ రోల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుంది.

ఈయన ఇప్పటి వరకు పోషించని పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.చిత్ర యూనిట్ చెబుతున్న ప్రకారం ఈ సినిమా పెద్ద సక్సెస్ కొట్టడమే కాకుండా ఆయన పాత్ర కూడా హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Telugu Salaar, Sapthagiri, Prasanth Neel, Prabhas, Prashanth Neel-Movie

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రముఖ తెలుగు స్టార్ కమెడియన్ కూడా భాగం కానున్నాడని తెలుస్తుంది.ఈయన కొద్దీ సేపు కాకుండా ఫుల్ లెన్త్ రోల్ లో నటించ నున్నాడని అందుకోసం ఈయన ఏకంగా 30 రోజుల కాల్ షీట్లు కూడా కేటాయించారని అంటున్నారు.ఆయన మరెవరో కాదు.కమెడియన్ సప్తగిరి. తెలుగులో సప్తగిరి తనకంటూ మంచి గుర్తింపై తెచ్చుకున్నాడు.ఈయన చేసిన పాత్రలన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి.

ఇక ఇప్పుడు ఈయన ప్రభాస్ సినిమాలో అవకాశం కొట్టేసినట్టు టాక్ వినిపిస్తుంది.మరి కామెడీ సీన్స్ తో సప్తగిరి ఎలా ఆకట్టుకుంటాడో వేచి చూడాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube