పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న చలాకీ చంటి  

Actor Chanti Missed From Major Accident-

ఈనాడు టెలివిజన్ లో ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్ ఎంత ఫెమస్సో, ఆ ప్రోగ్రామ్ లో చలాకీ చంటి కూడా అంతే ఫెమస్.అయితే ఈ రోజు తెల్లవారుజామున పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తుంది.ఈ రోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం నుంచి చంటి బయటపడ్డాడు.సూర్య పేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది...

Actor Chanti Missed From Major Accident--Actor Chanti Missed From Major Accident-

ఈ ప్రమాదంలో చంటి ప్రయాణిస్తున్న కారు.ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జవగా చంటికి స్వల్ప గాయాలేనట్లు తెలుస్తుంది.సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Actor Chanti Missed From Major Accident--Actor Chanti Missed From Major Accident-

చలాకీ చంటి.విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చంటిని కోదాడ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది.దీనితో కోదాడ లో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం ఆయనను హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.