బ్రహ్మానందంకు ఇష్టమైన నటి ఎవరో తెలుసా..?

తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసి కమెడియన్ గా ప్రేక్షకుల హృదయాలను బ్రహ్మానందం గెలుచుకున్నారు.ఈ ఏడాది విడుదలైన జాతిరత్నాలు సినిమాతో వయస్సు పెరిగినా కామెడీని అద్భుతంగా పండించగలనని బ్రహ్మానందం ప్రూవ్ చేసుకున్నారు.

 Actor Brahmanandam Says Shruti Is His Favourite Actor-TeluguStop.com

బ్రహ్మానందం ఎక్స్ ప్రెషన్స్ తో మాత్రం నవ్వించగల టాలెంట్ ఉన్న కమెడియన్ అని చెప్పవచ్చు.ప్రస్తుతం బ్రహ్మానందం పరిమితంగా సినిమాల్లో నటిస్తున్నారు.

అయితే తాజాగా అలీతో సరదాగా షోకు శ్రుతి, ప్రీతినిగమ్ హాజరు కాగా వీళ్లిద్దరూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.బ్రహ్మానందం ఒక సందర్భంలో అందరు తనకు ఫ్యాన్స్ అని తాను మాత్రం శృతికి ఫ్యాన్ అని చెప్పారని శృతి వెల్లడించారు.

 Actor Brahmanandam Says Shruti Is His Favourite Actor-బ్రహ్మానందంకు ఇష్టమైన నటి ఎవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భర్తతో తనకు ఏ విషయంలోనైనా గొడవ జరిగితే తన భర్త కిచెన్ లో ఉండే వంట పాత్రలను శుభ్రం చేయడంతో పాటు ఇంటిని కూడా క్లీన్ చేస్తారని శ్రుతి అన్నారు.

ఆ సమయంలో సెల్ ఫోన్ ను చూసుకుంటూ ఉంటానని శ్రుతి పేర్కొన్నారు.తనకు ప్రీతి నిగమ్ కు 30 సంవత్సరాల క్రితం నారాయణగూడలో పరిచయం ఏర్పడిందని శ్రుతి చెప్పుకొచ్చారు.ప్రీతినిగమ్, శ్రుతి బుల్లితెరపై నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో ఎక్కువగా నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.

అలీ ప్రీతి నిగమ్ తో మీరు తెరపైనే కాదు తెరవెనుక కూడా నెగిటివ్ షేడ్స్ ను చూపిస్తారా అని అడగగా మా ఆయన ఆ విషయానికి సమాధానం చెప్పాలని ప్రీతి నిగమ్ పేర్కొన్నారు.

నటిగా మంచి పేరు, గుర్తింపు ఉన్నప్పటికీ ఒక సందర్భంలో రోడ్డుపై చెప్పులు లేకుండా పరుగెత్తాల్సి వచ్చిందని ప్రీతి నిగమ్ అన్నారు.ఈ నెల 21వ తేదీన ఈ ఎపిసోడ్ ఈటీవీ ఛానల్ లో ప్రసారం కానుంది.ప్రీతినిగమ్, శ్రుతి సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

#Shruti #Shruti Husband #Negative Shades #Serial Actor #Preeti Nigam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు