ఆ నటుడిని తొక్కేయాలి… లేకపోతే కష్టం అంటున్న బ్రహ్మాజీ…  

Actor Brahmaji Tweets about color photo movie teaser, Brahmaji, Telugu senior actor, Color Photo Movie Teaser, Telugu film industry - Telugu Actor Brahmaji Tweets About Color Photo Movie Teaser, Brahmaji, Color Photo Movie Teaser, Telugu Film Industry, Telugu Senior Actor

తెలుగులో ప్రస్తుతం నూతన దర్శకుడు సందీప్ రాజ్ “కలర్ ఫోటో” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోగా పలు టాలీవుడ్ చిత్రాలలో కమెడియన్ మరియు హీరో స్నేహితుడి పాత్రలో ఎంతగానో అలరించిన “సుహాస్” నటిస్తున్నాడు.

 Actor Brahmaji React About Color Photo Movie Teaser

అలాగే హీరోయిన్ గా గా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి నటిస్తోంది.కాగా ఈ చిత్రంలో వైవా హర్ష, సునీల్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సభ్యులు టీజర్ ని విడుదల చేశారు.దీంతో ఈ చిత్ర టీజర్ చూసినటువంటి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు అనూహ్య రీతిలో స్పందిస్తున్నారు.

ఆ నటుడిని తొక్కేయాలి… లేకపోతే కష్టం అంటున్న బ్రహ్మాజీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ నటుడు మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. ఇందులో భాగంగా ఈ నటుడికి చాలా టాలెంట్ ఉందని అందుకే తొక్కేయాలని లేకపోతే చాలా డేంజర్ అంటూ సరదాగా తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.

మరోవైపు ఈ టీజర్ పై టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా స్పందించి టీజర్ చాలా బాగుందని,  ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.అలాగే చిత్ర యూనిట్ సభ్యుల పని తీరును కూడా ప్రశంసించాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తి కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా కొంత కాలం పాటు ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులను వాయిదా వేశారు.దాంతో ఈ చిత్రం విడుదల విషయంలో కూడా కొంతమేర ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

#ActorBrahmaji #TeluguFilm #Brahmaji #TeluguSenior #ColorPhoto

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actor Brahmaji React About Color Photo Movie Teaser Related Telugu News,Photos/Pics,Images..