లాటరీలో కోట్ల రూపాయలు సంపాదించిన బ్రహ్మాజీ.. ఏం జరిగిందంటే..?

తెలుగు సినీ నటుడు బ్రహ్మాజీ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించిన ఈయన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Actor Brahmaji Earn Crore In Lottery-TeluguStop.com

హీరోగా కూడా నటించిన బ్రహ్మాజీ ఆ తరువాత సహాయ పాత్రుడిగా బాగా మెప్పించాడు.ఇప్పటికీ సినిమాలలో తన వంతు పాత్రలతో బాగా మెప్పిస్తాడు బ్రహ్మాజీ.

నిన్నే పెళ్ళాడుతా, ఖడ్గం, మిరపకాయ, మర్యాదరామన్న వంటి పలు సినిమాలలో తన పాత్రకు మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈయనకు కోటి రూపాయల లాటరీ తగిలింది.

 Actor Brahmaji Earn Crore In Lottery-లాటరీలో కోట్ల రూపాయలు సంపాదించిన బ్రహ్మాజీ.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు బ్రహ్మాజీ.ఇక ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో బాగా షేర్ చేసుకుంటాడు.ఇదిలా ఉంటే తాజాగా ఆయనకు కోటి రూపాయల లాటరీ తగిలిందని మెసేజ్ వచ్చింది.మామూలుగా ఈ మధ్య ఫోన్ లలో ఇలా పైసలు రూపంలో లాటరీ పడిందంటూ తెగ మెసేజ్ లు వస్తుంటాయి.

దాంతో పర్సనల్ డీటెయిల్స్ తో పాటు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమని మెసేజ్ లు చేస్తుంటారు.

ఇలాంటిదే బ్రహ్మాజీ కూడా ఎదురయ్యింది.మీ ఫోన్ నెంబర్ కి నాలుగు కోట్ల 25 లక్షల రూపాయల లాటరీ తగిలింది అని మెసేజ్ రాగా యునైటెడ్ కింగ్డమ్ కు సంబంధించిన ల్యాండ్ రోవర్ కంపెనీ నుంచి ఈ డబ్బు మీకు లభిస్తుందని మెసేజ్ వచ్చింది.ఇక ఈ మెసేజ్ ను స్క్రీన్ షాట్ తీసి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు బ్రహ్మాజీ.

ఇక ఈ డబ్బు కోసం ఆయన ఫోన్ నెంబర్, వయసు, అడ్రస్ వంటి పలు వివరాలను ఒక మెయిల్ ఐడీకి చేయాలని పేర్కొనగా ఇక వీటిని బ్రహ్మాజీ స్క్రీన్ షాట్ తీసి హైదరాబాద్ పోలీస్, సైబరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశాడు.సార్ నాకు ఈ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది.దయచేసి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోగలరు అంటూ పోలీసులకు తెలిపాడు బ్రహ్మాజీ.ప్రస్తుతం ఈ మెసేజ్ వైరల్ గా మారింది.

#Twitter #Earn Crore #Social Media #FakeLottery #United Kingdom

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు