పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు.. ఆయనపై పెద్ద ఇంప్రెషన్ లేదంటూ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన క్రేజ్ ఏ హీరోకు కూడా లేదు.

 Actor Bharath Reddy Shocking Comments On Pawan Kalyan, Pawan Kalyan, Actor Bhara-TeluguStop.com

ఈయనకు సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాదు.ప్రముఖులు, సెలెబ్రిటీలు సైతం ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే ఎంత ఫ్యాన్స్ ఉన్న కూడా ఈయనకు నెగిటివ్ కామెంట్స్ చేసే వారు కూడా ఉన్నారు.

 Actor Bharath Reddy Shocking Comments On Pawan Kalyan, Pawan Kalyan, Actor Bhara-TeluguStop.com

కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేసే వారిని అడ్రెస్ కూడా లేకుండా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఆయనపై ఈగ కూడా వాలకుండా కాపాడుకుంటూ ఉంటారు.మరి అలాంటి ఫ్యాన్స్ ఈయనపై షాకింగ్ కామెంట్స్ చేస్తే వారిని ఊరు కుంటారా.అస్సలు ఊరుకోరు.వారిని ట్రోల్స్ చేసి వారి భరతం పడతారు.

ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై భరత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ వీడియో ఎప్పటిదో అయినా ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో ఈ వీడియో కాస్త అందరి దృష్టిలో పడుతుంది.

ఒకానొక సందర్భంలో భరత్ రెడ్డి పవన్ పై కామెంట్స్ చేసాడు.

Telugu Bharath Reddy, Bharathreddy, Pawan Kalyan-Movie

ఈయన గురించి ఒక ఇంటర్వ్యూలో యాంకర్ పవన్ తో మీరు నటించారు కదా ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు.అని అడుగగా ఈయన ఆ ప్రశ్నకు జవాబు చెబుతూ.ఆయన గురించి నేను లోపల ఏమి అనుకోవడం లేదు.

బయట ఏమీ అనుకోవడం లేదు.కానీ ఆ హీరోపై నాకైతే ఎలాంటి ఇంప్రెషన్ లేదు అని తెలిపాడు.

పవన్ కళ్యాణ్ ఎవరినైనా తిట్టాలి అనుకున్నా లేదంటే ఏదైనా తిట్టాలి అనుకున్న వాటిని సినిమాల్లో డైలాగులుగా పెట్టుకుంటాడు.అది ఆయన ఆలోచించే విధానం.ఆయన ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే విధానం అలా ఉంటుంది కాబట్టే ఆయనపై నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అంటూ భరత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube