నన్ను అంకుల్‌ అని పిలవడం నచ్చలేదు.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్!

Actor Balakrishna About Akhanda Movie Said Thanks To Audience

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ మూవీ భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.పుష్ప ది రైజ్ మూవీ రిలీజయ్యే వరకు అఖండ సినిమాకు పోటీనిచ్చే సినిమా లేదనే చెప్పాలి.

 Actor Balakrishna About Akhanda Movie Said Thanks To Audience-TeluguStop.com

అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అఖండ హవా కొనసాగుతోంది.ఈ వీకెండ్ వరకు అఖండ మూవీకి టికెట్లు దొరకడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

స్టార్ హీరో బాలయ్య ప్రమోషన్స్ లో పాల్గొంటూ అఖండపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నారు.

 Actor Balakrishna About Akhanda Movie Said Thanks To Audience-నన్ను అంకుల్‌ అని పిలవడం నచ్చలేదు.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నగరంలోని ఒక థియేటర్ లో అఖండ మూవీని వీక్షించిన బాలయ్య ఆ తర్వాత మీడియాతో ముచ్చటిస్తూ అఖండ సినిమాతో తనకు సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

కొత్తదనంతో ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి అఖండ సక్సెస్ నిదర్శనమని బాలయ్య వెల్లడించారు.పిల్లలకు ‘అఖండ’ మూవీ చాలా బాగా నచ్చిందని బాలయ్య పేర్కొన్నారు.

అంకుల్ ‘అఖండ’ సినిమా అద్భుతంగా ఉంది అని పిల్లలు తనతో చెబుతున్నారని బాలయ్య చెప్పుకొచ్చారు.

అంతా బాగానే ఉన్నా పిల్లలు అంకుల్ అని పిలవడం నాకు నచ్చలేదని బాలయ్య సరదాగా చెప్పుకొచ్చారు.

అఖండ సక్సెస్ ఇండస్ట్రీ సక్సెస్ అని బాలయ్య పేర్కొన్నారు.ఈ సినిమాలో నిజాలను చూపించామని చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా మేమేనని బాలయ్య వెల్లడించారు.

పనిలో దేవుడు ఉన్నాడని అందువల్ల పనినే మేము నమ్ముతామని బాలయ్య పేర్కొన్నారు.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Hattrick, Response, Meet, Uncle-Movie

లెజెండ్ సినిమా చేస్తున్న సమయంలో సింహా సినిమా గురించి ఆలోచించలేదని అఖండ సినిమా చేస్తున్న సమయంలో లెజెండ్ గురించి ఆలోచించలేదని బాలయ్య వెల్లడించారు.బాలయ్య, బోయపాటి ఖాతాలో ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది.థమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

కలెక్షన్ల పరంగా ‘అఖండ’ మూవీ ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

#Akhanda #Boyapati Srinu #Balakrishna #Hattrick #Meet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube