ఆ దర్శకుడు నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదన్న బాలాదిత్య.. ఏం జరిగిందంటే?

ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజకి, తనకు మధ్య జరిగిన సంభాషణను నటుడు బాలదిత్య గుర్తు చేసుకున్నారు.తాను అప్పటికే రచనలు, కథలు రాస్తున్నానని తేజ గారికి కూడా తెలుసని అన్నారు.

 Actor Baladitya About Director Teja Incident Not Lifting His Phone Call, Baladit-TeluguStop.com

అయితే అవకాశం ఇస్తామని చెప్పి మనకు కాల్ చేయలేదంటే ఇక వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వాలనుకోవట్లే అని ఆ సమయంలోనే కొత్త వారిని సంప్రదించాలని చెప్పినట్టు బాలదిత్య చెప్పారు.అంతే కాకుండా ఎవ్వరికీ ఒక్క పాట రాస్తానని చెప్పొద్దని అన్ని పాటలు మీరే రాస్తారని చెప్పుకుంటే మీకొక ఐడెంటిటీ వస్తుందని తేజ గారు చెప్పినట్టు బాలాదిత్య తెలిపారు.

అలా అయితేనే కథమీద ఒక పట్టు వస్తుందని అప్పుడే ఒక్కో పాటని ఎలా రాయాలో తెలుస్తాయని చెప్పినట్టు ఆయన తెలిపారు.

మీరు చాలా కష్టపడుతున్నారు.

ఐనా కూడా అవకాశం రావట్లేదు.కాబట్టి తానొక పని చెప్తా చేయమన్నారని బాలాదిత్య అన్నారు.

మీరు తేజ సినిమాలో నటిస్తున్నట్లు అందరికీ చెప్పమని చెప్పారని ఆయన అన్నారు.ఏమైనా ప్రాబ్లెమ్ ఐతే అప్పుడు చూసుకుందాం అన్నారు.

తేజ సినిమా చేస్తున్నా అంటే.అలా ఐనా ఇంకా కొంతమందికి మీరు తెలిసి మీకు అవకాశాలు కూడా వస్తే మంచిదే కదా అని తేజ అన్నట్టు బాలాదిత్య వివరించారు.

ఆ తర్వాత తాము అనుకున్నట్టుగానే బాలాదిత్య ప్రెస్ కి అందరికీ ప్రకటించేశానని చెప్పారు.

Telugu Baladitya, Bharani, Teja Baladitya, Baladitya Teja, Tej, Teja, Phone, Tol

దాంతో అక్కడున్న వారు తనను పొగిడారని చెప్పారు.ఇదంతా అయిపోయిన మరుసటి రోజు.న్యూస్ పేపర్ చూడగానే… తేజ సినిమాలో బాలాదిత్య హీరో అని రావడంతో షాక్ అయ్యానని ఆయన తెలిపారు.

తన ఫోన్ చూస్కుంటే 10 మిస్డ్ కాల్స్ చాలా మెసేజ్ లు ఉన్నాయని ఆయన అన్నారు.అవన్నీ కూడా తనకు తేజ సినిమాలో ఛాన్స్ వచ్చిందని … కంగ్రాట్స్ చెప్తూ వచ్చిన మెసేజెస్, కాల్స్….

వెంటనే తేజ గారికి ఫోన్ చేస్తే.ఆయన ఆరోజు రెస్పాండ్ కాకపోయే సరికి అసలేమైందోనని టెన్షన్ పడ్డట్టు ఆయన తెలిపారు.

Telugu Baladitya, Bharani, Teja Baladitya, Baladitya Teja, Tej, Teja, Phone, Tol

వెంటనే భరణి గారికి కాల్ చేయడంతో ఆయన తేజగారికి ఫోన్ చేసి మాట్లాడారు.నాతో కూడా తేజ గారు కాల్ చేసి జరిగిన దానికి నువ్వేం టెన్షన్ పడకు.ఐనా అలా చేయమని నేనే చెప్పాను కదా.ఆ పేపర్ వాళ్ళు ఫోన్ చేసి సారీ చెప్పారని తేజ చెప్పడంతో బాలాదిత్య కొంచెం రిలాక్స్ అయినట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube