పెద్ద ఎన్టీఆర్ పోలికలు రావడం తారక్ అదృష్టం.. బాబు మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Babu Mohan Interesting Comments About Senior Ntr And Junior Ntr

నందమూరి హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో పాపులారిటీతో పాటు విజయాలను సొంతం చేసుకున్నారు.ఎన్టీఆర్ నటించిన అతి త్వరలో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చరణ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తుండగా బాహుబలి2 తర్వాత రాజమౌళి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 Actor Babu Mohan Interesting Comments About Senior Ntr And Junior Ntr-TeluguStop.com

2022 సంవత్సరం జనవరి 7వ తేదీన రిలీజయ్యే ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తాజాగా బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నటన విషయానికి వస్తే సీనియర్ ఎన్టీఆర్ స్టైల్ సీనియర్ ఎన్టీఆర్ కు ఉందని జూనియర్ ఎన్టీఅర్ స్టైల్ జూనియర్ ఎన్టీఆర్ కు ఉందని బాబు మోహన్ తెలిపారు.

సీనియర్ ఎన్టీఆర్ భగవత్ స్వరూపుడు అని జూనియర్ ఎన్టీఆర్ ఆయన మనవడు అని అయితే సీనియర్ ఎన్టీఆర్ పోలికలు చాలావరకు ఆయన కొడుకులకు రాకపోయినా మనవడు జూనియర్ ఎన్టీఆర్ కు వచ్చాయని బాబు మోహన్ పేర్కొన్నారు.

 Actor Babu Mohan Interesting Comments About Senior Ntr And Junior Ntr-పెద్ద ఎన్టీఆర్ పోలికలు రావడం తారక్ అదృష్టం.. బాబు మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Babu Mohan, Babu Mohan Comments, Babu Mohan Interview, Comedian Babu Mohan, Interesting Comments, Junior Ntr, Senior Ntr, Senior Ntr Similarities To Jr Ntr, Serials, Tollywood, Trs-Movie

సీనియర్ ఎన్టీఆర్ పోలికలు రావడం జూనియర్ ఎన్టీఆర్ అదృష్టమని బాబు మోహన్ తెలిపారు.తన మనస్సుకు గాయమైందని అందువల్ల టీ.ఆర్.ఎస్.పార్టీలోకి వెళ్లే ఉద్దేశం తనకు లేదని బాబు మోహన్ పేర్కొన్నారు.

Telugu Babu Mohan, Babu Mohan Comments, Babu Mohan Interview, Comedian Babu Mohan, Interesting Comments, Junior Ntr, Senior Ntr, Senior Ntr Similarities To Jr Ntr, Serials, Tollywood, Trs-Movie

ఆ గాయం ఎందుకు అయిందో తనకు కూడా తెలియదని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.కొన్ని సీరియల్స్ లో సెంటిమెంట్ కోసం ఒక్క ఎపిసోడ్ అలా నటించానని బాబు మోహన్ తెలిపారు.ప్రస్తుతం సినిమాలతో బిజీ అవుతున్నానని రోషన్ పెళ్లిసందడిలో తాను నటించానని మరికొన్ని సినిమాలలో కూడా తాను నటిస్తున్నానని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

#BabuMohan #Babu Mohan #Serials #Babu Mohan #NTR

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube