ఆ జాబ్ వదిలేయకపోతే కలెక్టర్ అయ్యేవాడిని.. బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్!

నటుడిగా, రాజకీయ నాయకుడిగా బాబు మోహన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం బాబు మోహన్ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.

 Actor Babu Mohan Interesting Comments About His Job Details, Babu Mohan, Kcr, Ch-TeluguStop.com

తాజాగా బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సినిమా యాక్టర్ కాకముందే బుల్లితెర యాక్టర్ అని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో బుల్లితెరపై తాను చిన్నచిన్న ప్రోగ్రామ్స్ చేసేవాడినని బాబు మోహన్ పేర్కొన్నారు.

తను వేసిన నాటకాలు చూసి సినిమాలలో ఆఫర్లు ఇచ్చారని బాబు మోహన్ వెల్లడించారు.అప్పట్లో తాను సివిల్ సప్లైస్ లో ఇన్ స్పెక్టర్ అని తాను ఇప్పుడు సర్వీస్ లో ఉంటే కలెక్టర్ అయ్యేవాడినని బాబు మోహన్ తన గురించి ఎవరికీ తెలియని విషయాలను చెప్పుకొచ్చారు.

అంకుశం సినిమా రిలీజైన వారం రోజులలో తాను పది సినిమాలకు బుక్ అయ్యానని బాబు మోహన్ వెల్లడించారు.ఆ సినిమా తర్వాత బండి ఎక్కడికో వెళ్లిపోయిందని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.

కెరీర్ తొలినాళ్లలో లీవ్ పెట్టి ఉద్యోగం చేసేవాడినని బాబు మోహన్ వెల్లడించారు.

Telugu Babu Mohan, Ankusham, Babu Mohan Job, Chandrababu, Civil, Resign Job, Sen

5 సంవత్సరాలు లాస్ ఆఫ్ పే పెట్టి ఉద్యోగం చేయకుండా సినిమాల్లో నటించానని అయితే ఆ తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేశానని బాబు మోహన్ పేర్కొన్నారు.దాసరి ఇండస్ట్రీకి కొందరు అవసరం కొందరికి ఇండస్ట్రీ అవసరం నువ్వు రిజైన్ చేస్తే ఇంకొకరికి ఉద్యోగం వస్తుందని చెప్పడంతో తాను రిజైన్ చేశానని బాబు మోహన్ తెలిపారు.

Telugu Babu Mohan, Ankusham, Babu Mohan Job, Chandrababu, Civil, Resign Job, Sen

సీనియర్ ఎన్టీఆర్ వల్ల తాను రాజకీయాల్లోకి వచ్చానని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ కు తాను వీరాభిమానినని ఆ పార్టీ తరపున తాను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నానని బాబు మోహన్ తెలిపారు.ఆ తర్వాత చంద్రబాబు, కేసీఆర్ ప్రోత్సాహంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని బాబు మోహన్ పేర్కొన్నారు.

ఎవరికీ తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను బాబు మోహన్ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube