ఆర్జీవీ టాలెంట్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన అవినాష్.. ఏమైందంటే?

ప్రముఖ నటుడు అవినాష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చదువు పూర్తైన తర్వాత తనకు బీపీవోలో ట్రైనర్ గా జాబ్ వచ్చిందని ఆ సమయంలో నైట్ షిఫ్ట్ చేసేవాడినని అన్నారు.నైట్ షిఫ్ట్ చేయడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి దొరకదని ఆరోగ్య సమస్యలు రావడంతో డాక్టర్లు డే షిఫ్ట్ జాబ్స్ చూసుకోవాలని సూచించారని అవినాష్ అన్నారు.

 Actor Avinash Interesting Comments About Director Ram Gopal Varma Details, Avina-TeluguStop.com

ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా నా చెల్లికి మాటీవీ సీరియల్ లో ఛాన్స్ వచ్చిందని అవినాష్ అన్నారు.

చెల్లికి ఐఏఎస్, ఐపీఎస్ కావాలని కోరికని అందువల్ల సీరియల్ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని అవినాష్ అన్నారు.

ఆ తర్వాత అమ్మ చెప్పడంతో తనను తమ్మారెడ్డి భరద్వాజ అడిషన్ కు పిలిచారని తాను అడిషన్ సరిగ్గా ఇవ్వలేదని అవినాష్ వెల్లడించారు.తాను సరిగ్గా చేయకపోవడంతో ఛాన్స్ రాదని అనుకున్నా తనకు ఛాన్స్ దక్కిందని అవినాష్ అన్నారు.

ఆ తర్వాత టీవీలో వరుసగా ఆఫర్లు వచ్చాయని అవినాష్ తెలిపారు.

ఈటీవీలో తాను ఎక్కువగా సీరియల్స్ చేశానని ప్రతిభ ఉన్న ఆర్టిస్టులకు అక్కడ ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుందని అవినాష్ అన్నారు.

Telugu Avinash, Ram Gopal Varma, Etv Suman-Movie

ఈటీవీ సుమన్ తెలుగు భాషకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రొఫెషనల్ గా వర్క్ చేయించేవారని అవినాష్ తెలిపారు.సీరియళ్లలో లీడ్ క్యారెక్టర్లు చేసేవాళ్లకు అగ్రిమెంట్లు ఉంటాయని అవినాష్ అన్నారు.వర్మ సినిమా అంటే హడావిడి ఏం ఉండదని అవినాష్ తెలిపారు.

Telugu Avinash, Ram Gopal Varma, Etv Suman-Movie

చిన్న ట్యూబ్ లైట్, కెనాన్ 5డీ కెమెరాతో మూడు గంటల్లో ఆర్జీవీ రెండు భాషల్లో షూటింగ్ చేశారని అవినాష్ చెప్పుకొచ్చారు.ఉదయం 9 గంటలకు వెళితే ప్రొడక్షన్ వాళ్లు ఎవరూ లేరని మేనేజర్ వచ్చి టిఫిన్ అడిగి పార్శిల్ తెచ్చి ఇచ్చాడని అవినాష్ అన్నారు.అక్కడ కాస్ట్యూమర్ కూడా లేరని అవినాష్ వెల్లడించారు.

లైట్ మేన్లు కూడా లేకుండా షూటింగ్ జరిగిందని అవినాష్ కామెంట్లు చేశారు.ఆర్జీవీ పర్ఫెక్షనిస్ట్ అని అవినాష్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube