2 నెలల బిడ్డను వదిలి వెళ్ళిన నటుడి భార్య.. కారణం?

ప్రస్తుతం పరిస్థితులు ఏంటో అందరికీ తెలిసిందే.ఎక్కడి నుండో వచ్చి ప్రజలను మింగేస్తుంది ఈ కరోనా వైరస్.

 Actor Aniruddh Dave Wife Travels Visit Him Hospital-TeluguStop.com

ఏడాది నుండి పట్టిపీడిస్తున్న ఈ వైరస్ వల్ల.మరణించాక చివరి చూపు కూడా నోచుకోలేని పరిస్థితిగా మారింది.

ఈ వైరస్ వ్యాపించాక.మళ్లీ వారిని చూస్తామో లేదో అన్న భయాలే ఎక్కువవుతున్నాయి.

 Actor Aniruddh Dave Wife Travels Visit Him Hospital-2 నెలల బిడ్డను వదిలి వెళ్ళిన నటుడి భార్య.. కారణం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకరినొకరు తాకకుండా, కనీసం చూడకుండా.చేసింది ఈ మహమ్మారి.

ఇప్పటికే ఎంతోమంది ఈ వైరస్ కు బలి అవ్వగా.ఇంకా ఎంతోమంది వైరస్ బారిన పడుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా తన భర్తకు సీరియస్ గా ఉండటంతో తన రెండు నెలల బిడ్డను వదిలేసి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది.


ప్రముఖ టీవీ నటుడు అనిరుధ్ దవే.

ఈయనకు వైరస్ వ్యాపించగా భోపాల్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్ గా ఉండటంతో.

తాజాగా తన భార్య శుభి అహుజా.తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.ప్రస్తుతం ఆ పోస్ట్ అందరి హృదయాలను తాకేలా ఉంది.

తన భర్త కోవిడ్ బారిన పడ్డాడని.

ప్రస్తుతం తన భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని తెలిపింది.ఇక ఈ సమయంలో తను తన భర్త దగ్గర ఉండటం ఎంతో అవసరమని తెలిపింది.

కానీ తనకు రెండు నెలల చిన్నారి ఉందని, తనని చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరని, తన భర్తని చూసుకోవడానికి కూడా ఎవరూ లేరని, అత్యంత క్లిష్ట సమయం గా మారిందని తెలిపింది.తన జీవితంలో ప్రస్తుతం ఈ సమయం కఠినమైన సవాలు అంటూ తప్పనిసరి పరిస్థితుల్లో తన బిడ్డను వదిలి తన భర్త దగ్గరకు వెళ్తున్నానని తెలిపింది.

ఇక తన బిడ్డ, భర్త క్షేమం కోసం ప్రార్థించాలని అందరిని కోరుతున్నాను అంటూ.మీ ప్రార్థనలు నాకు ఇప్పుడు ఎంతో ముఖ్యం అంటూ అభిమానులతో పంచుకుంది.


ఈ మాట ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించగా.ధైర్యంగా ఉండండి అంటూ.మీ భర్త, చిన్నారి క్షేమం గా ఉంటారని నెటిజనులు దీవిస్తున్నారు.

#AnirudhhDave #COVID-19 #Anirudhh Dave #Shubhi Ahuja #Bhopal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు