50 ఏళ్ళ వయసులో తండ్రి అయిన నటుడు!

ఆడపిల్ల భారం అనుకునే ఈ కాలంలో చాలా మంది ఆడపిల్లలను చంపడమో లేదా ఇతరులకు అమ్మడమో వంటి సమాజం ఇది.అలాంటి సమాజం లో కొందరు ఆడపిల్లని దేవతగా భావిస్తే మరికొందరు దయ్యంలా భావించి దూరం పెడుతారు.

 Actor And Bjp Mp Manoj Tiwari Blessed With Baby Girl-TeluguStop.com

కాగా తమకు ఆడపిల్ల పుట్టిందని తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు నటుడు మనోజ్ తివారి.

మనోజ్ తివారి నటుడు, గాయకుడు గానే కాకుండా రాజకీయాల్లో కూడా తన వంతు బాధ్యతలను తీసుకుంటాడు.

 Actor And Bjp Mp Manoj Tiwari Blessed With Baby Girl-50 ఏళ్ళ వయసులో తండ్రి అయిన నటుడు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా ఈయన భోజ్ పూరి సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా మంచి స్థానాన్ని గెలుచుకున్నాడు మనోజ్.అంతేకాకుండా సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ షో లో కూడా పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే.

కాగా ఇటీవలే డిసెంబర్ 30వ తేదీన తనకు ఆడబిడ్డ జన్మించిందని సంతోషంతో జై జగదంబ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలిపాడు.అంతే కాకుండా తన బిడ్డని ఎత్తుకొని దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.

కాగా మనోజ్ తివారి కి ఇదివరకే ఓ ఆడపిల్ల ఉండగా ఇప్పుడు పుట్టిన పాప తన రెండవ భార్య శ్వేతా జన్మనిచ్చింది.ఇంతకుముందు మొదటి భార్య రాణి అనే యువతిని చేసుకోగా వారికి ఓ ఆడపిల్ల ఉంది.కాగా కొన్ని కారణాల వల్ల వాళ్ళ మధ్య విడాకులు జరిగాయి.మొదటి భార్య పాప ప్రస్తుతం మనోజ్ తివారి దగ్గరే ఉంది.

కాగా ఆయనకు బిడ్డ పుట్టిన సందర్భంగా పలువురు నాయకులు, సినీ నటులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఇదిలా ఉంటే ఆయన 2008లో సమాజ్ వాదీ పార్టీ తరపున గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయగా అందులో పరాజయం పొందాడు.

తర్వాత బిజెపి తరపున తత్తర ఢిల్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.కాగా ఈయన ‘దేవ్రా బెయిల్ దీవానా’ సినిమాలో చివరి సారిగా నటించారు.

#Baby #BJPMP #Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు