ప్రముఖ నటుడు అమర్ దీప్ చౌదరి పారితోషికం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో అమర్ దీప్ చౌదరి ఒకటనే సంగతి తెలిసిందే.బుల్లితెరపై అమర్ దీప్ చౌదరి మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్6 లో అమర్ దీప్ చౌదరి ఒక కంటెస్టెంట్ గా ఉన్నారని సోషల్ మీడియా, వెబ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

 Actor Amar Deep Choudary Remuneration For Serials Details. Amar Dep, Sirisirimuv-TeluguStop.com

తాజాగా అమర్ దీప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

జానకి కలగనలేదు సీరియల్ సక్సెస్ సాధించడంతో అమర్ దీప్ చౌదరికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.

గతంలో ఎన్నో సీరియళ్లలో నటించినా రాని గుర్తింపు అమర్ దీప్ కు ఈ సీరియల్ ద్వారా దక్కింది.మరోవైపు టాప్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న తేజస్విని గౌడతో అమర్ దీప్ చౌదరి నిశ్చితార్థం జరిగింది.

మరికొన్ని నెలల తర్వాత వీళ్లిద్దరి వివాహం జరగనుందని సమాచారం అందుతోంది.

ఒక ఇంటర్య్వూలో అమర్ దీప్ రెమ్యునరేషన్ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Telugu Rupees, Amar Deep, Amardeep, Sirisirimuvva, Tejaswini Gowda-Movie

శైలజారెడ్డి అల్లుడు మూవీ కోసం రెండు రోజులు పని చేశానని ఆ సినిమాకు రోజుకు 7500 రూపాయల చొప్పున రెమ్యునరేషన్ దక్కిందని అమర్ దీప్ అన్నారు.మొదట పని చేసిన సీరియల్ కు నెలకు పాతిక వేల రూపాయలు పారితోషికంగా అందుకున్నానని ఆయన్ కామెంట్లు చేశారు.

Telugu Rupees, Amar Deep, Amardeep, Sirisirimuvva, Tejaswini Gowda-Movie

సిరిసిరిమువ్వ సీరియల్ కోసం నెలకు 80,000 రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నానని చెప్పిన అమర్ దీప్ అభిలాష మూవీ కోసం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నానని తెలిపారు.సీరియళ్లలో హీరోగా ఎక్కువరోజులు డేట్స్ కేటాయించాల్సి ఉండటంతో నెలవారీగా అమర్ దీప్ పారితోషికం తీసుకుంటున్నారు.అమర్ దీప్ కెరీర్ విషయంలో మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube