టీడీపీ మంత్రితో ఆలీ భేటీ ..! ఏ పార్టీలో చేరబోతున్నాడు ...?     2019-01-08   22:41:03  IST  Sai Mallula

సినీ కమెడియన్ ఆలీ రాజకీయ అడుగులు ఎటువైపు పడుతున్నాయో ఎవరికీ అర్ధం కావడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ కి అత్యంత అప్తుడిగా ముద్రపడ్డ ఆలీ జనసేన పార్టీలో చేరతారని అంతా అనుకున్నా… ఆయన మాత్రం ఆ పార్టీలో చేరలేదు. అయితే ఎన్నికల సమయంలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే అకస్మాత్తుగా ఆయన వైసీపీ అధినేత జగన్ ని కలవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ని అలీ కలిసి మరోసారి ఆశ్చర్యపరిచాడు.

Actor Ali Meet Tdp Minister Ganta Srinivasarao Today-

Actor Ali Meet Tdp Minister Ganta Srinivasarao Today

ఇంతకీ ఆలీ ఏ పార్టీలో చేరాలి అనుకుంటున్నాడు అనే డౌట్ అందరిలోనూ వ్యక్తం అయ్యింది. ఆయన మాత్రం గుంటూరు వెస్ట్ టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకుని అందరి చుట్టూ తిరుగుతున్నాడు. తాజాగా మంత్రి గంటా శ్రీనివాసరావు తో భేటీ అవ్వడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతకీ ఆయన ఏ పార్టీలో చేరాలి అనుకుంటున్నాడో అన్న విషయం ఇప్పటికీ పెద్ద మిస్టరీగా మారింది.