ఇండస్ట్రీలో విషాదం.. ఆ స్టార్ హీరో తండ్రి కన్నుమూత.. ప్రముఖుల దిగ్బ్రాంతి!

కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ (Ajith Kumar) ఒకరు.ఈయన తమిళ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగు తున్నారు.

 Actor Ajith S Father P Subramaniam Passed Away, Ajith Kumar, Kollywood, Ajith's-TeluguStop.com

కోలీవుడ్ లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుని తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక అజిత్ సినిమాలు డబ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కూడా ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇటీవలే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘తునివు’ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో ఇదే జోష్ లో ప్రజెంట్ అజిత్ కుమార్ తన కెరీర్ లో 62వ సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమాను మగిళ్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్నాడు.ఇటీవలే చెన్నైలో ఈ సినిమా గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.ఇదిలా ఉండగా కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు విషాదం నెలకొంది.

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ థలా అభిమానులకు షాకింగ్ వార్త అందింది.ఈ వార్త తెలియడంతో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి.తమ అభిమాన హీరో అజిత్ కుమార్ తండ్రి కన్నుమూశారు.ఈ స్టార్ హీరో తండ్రి ఇలా లేరు అనే వార్త కోలీవుడ్ సినీ వర్గాల్లో విషాదంగా మారింది.

అజిత్ కుమార్ తండ్రి సుబ్రమణియన్ ఈ రోజు చెన్నైలో తుది శ్వాస విడిచినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి.దీంతో ఈ స్టార్ హీరో తండ్రి మరణ వార్త విని ప్రముఖులు అజిత్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.ఇక అజిత్ ఫ్యాన్స్ కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube