లండన్ లో నటుడు అజయ్.. భార్యతో మందు కొడుతూ రచ్చ రచ్చ?

Actor Ajay Enjoys With His Wife Swetha In London

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ గా, సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు నటుడు అజయ్.స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటించి విలన్ గా టాప్ ప్లేస్ లో కొనసాగాడు.

 Actor Ajay Enjoys With His Wife Swetha In London-TeluguStop.com

ఇక అజయ్ హీరోగా ప్రయత్నించి సారాయి వీర్రాజు అనే సినిమాలో హీరోగా నటించినప్పటికీ ఆ సినిమా బెడిసి కొట్టింది.ఆ తరువాత హీరోగా కాకుండా మళ్లీ విలన్ గానే చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నాడు.

విక్రమార్కుడు,పోకిరి లాంటి సినిమాలు అజయ్ కి విలన్ గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

 Actor Ajay Enjoys With His Wife Swetha In London-లండన్ లో నటుడు అజయ్.. భార్యతో మందు కొడుతూ రచ్చ రచ్చ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత కొంచెం గ్యాప్ తరవాత ఇష్క్ సినిమాతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.

ఇక చివరగా ఇటీవల రాజ్ తరుణ్ నటించిన అనుభవించు రాజా సినిమాలో నటించాడు.ఈ సినిమాలో నటించినందుకు గాను అజయ్ కి మంచి పేరు వచ్చింది.

అయితే నటుడు అజయ్ గురించి మనందరికీ తెలిసిందే, కానీ ఆయన భార్య, ఫ్యామిలీ గురించి ఎవరికీ అంతగా తెలియదు.

అజయ్ భార్య పేరు శ్వేత మోడల్.ఆమె మిస్ ఇండియా వంటి పోటీల్లో పాల్గొంది.ఇదిలా ఉంటే తాజాగా అజయ్ తన భార్యతో కలిసి లండన్ లో గడిపిన క్షణాలు తలుచుకుంటూ ఒక ఫోటోని షేర్ చేశాడు.

ఈ ఫోటోలో అజయ్ చేతిలో మందు గ్లాస్ పట్టుకుని కనిపించాడు.ఆయన భార్య కూడా కప్పులో టీ, కాఫీ ఏదో తాగుతూ కనిపించింది.ఈ జంట ప్రస్తుతం లండన్ లో ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.ఇక అజయ్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Socila #Ajay #Swetha #Sarai Veerraju #Raj Tharun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube