టిడిపి జనసేన పార్టీల పొత్తు అంశం ఇంకా అధినేతల మధ్య ఒక క్లారిటీ రాలేదు.ఎన్నికల నాటికి అధికారికంగా పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నాయి.
అవసరమైతే బీజేపీని కూడా కలుపుకు వెళ్లి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసి అధికారాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలోనే జనసేన , టిడిపి ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నాయి.ఈ మూడు పార్టీల ఉమ్మడి శత్రువు వైసీపీ అధినేత జగన్ కావడంతో, ఏపీలో బలమైన పార్టీగా వైసీపీ ఉండడంతో, ఆ పార్టీ తో తలపడేందుకు విపక్షాలు అన్నీ ఏకం కావడం ఒక్కటే మార్గమని అభిప్రాయంలో బాబు, పవన్ ఉన్నారు.
పైన అధినాయకత్వం ఆలోచన ఈ విధంగా ఉంటే క్షేత్రస్థాయిలో మాత్రం తెలుగు తమ్ముళ్లు జనసైనికులు మాత్రం అప్పుడే పొత్తు సెట్ అయిపోయినట్టు గానే వ్యవహారాలు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పిటిసి, పంచాయతీ ఎన్నికల్లో టిడిపి , జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో ఒక అంగీకారానికి వచ్చి పోటీ చేయడంతో చాలా చోట్ల ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వెలువడ్డాయి.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ అనధికారిక పొత్తులు కారణంగా జనసేన టిడిపి లు బాగా లాభపడ్డాయి.ఇప్పుడు ఏపీలో కొన్నిచోట్ల మున్సిపల్ ఎన్నికలను నిర్వహించబోతున్నారు.ఈ మేరకు నోటిఫికేషన్ కూడా వెలువడబోతూ ఉండడం తో మళ్లీ జనసేన టిడిపి లు క్షేత్రస్థాయిలో పొత్తు విషయంలో ఒక అంగీకారానికి రావాలని నిర్ణయానికి వచ్చాడట.అయితే ఈ విషయంలో పార్టీ అధినాయకత్వాల అభిప్రాయం ఏ విధంగా ఉందో స్పష్టంగా తేలనప్పటికీ స్థానికంగా నాయకులు మాత్రం ఈ పొత్తులను సెట్ చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారట.2024 ఎన్నికల నాటికి జనసేన తెలుగుదేశం పార్టీ అధికారికంగా పొత్తు పెట్టుకుంటాయి అనే అభిప్రాయానికి ఆ పార్టీ నాయకులు వచ్చేశారు.

అందుకే కాస్త ముందుగానే అధినేతల అనుమతి లేకుండానే స్థానికంగా పొత్తులను ఖరారు చేసుకుంటూ ఫలితాలు తమకు అనుకూలంగా ఉండేలా చేసుకుంటున్నారు.పొత్తు పెట్టుకున్న, పెట్టుకోకపోయినా గెలుపే ప్రధాన కావడంతో ఆయా పార్టీ అధినేతలు సైతం ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉంటున్నారట.పై స్థాయిలో పొత్తులపై నిర్ణయాలు ఎలా జరిగినా, క్షేత్రస్థాయిలో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఒకరికొకరు సహకరించుకుంటేనే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుంది.
ఇప్పుడు జనసేన, టీడీపీలకు అటువంటి ఇబ్బంది లేకపోవడంతో పొత్తులపై ఎన్నికల వరకు వేచి చూడకుండా కాస్త ముందుగానే ఖరారు చేసుకునేలా కనిపిస్తున్నారు.