ఉద్యానవన తోటలైన చీని, సపోటా, దానిమ్మ పంటలకు( Pomegranate ) కాండం తొలిచే పురుగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.సరైన యాజమాన్య పద్ధతులు పాటించి తొలి దశలోనే ఈ పురుగులను అరికట్టాల్సి ఉంటుంది.
వీటి నివారణ ఎలా చేయాలో తెలుసుకుందాం.ముదిరిన తోటల్లో ఈ కాండం తొలిచే పురుగులను గుర్తించవచ్చు.
జూన్ నుండి జూలై మాసాల్లో పంట తోటలను ఈ పురుగులు అధికంగా ఆశిస్తాయి.జూలై నెలలో తోటలో ఉండే మొక్కలపై ఈ పురుగుల గుడ్లను గుర్తించి పూర్తిగా తొలగించాలి.
ఇవి సంవత్సరం పొడవునా పండ్ల తోటలను ఆశిస్తాయి.మొక్క యొక్క లేత కొమ్మలపై ఇవి దాడి చేయడం ప్రారంభిస్తాయి.
తల్లి పురుగులు జూలైలో కోశస్థదశ నుండి బయటకు వచ్చి చెట్టు బెరడు వదులుగా ఉండే ప్రదేశాల్లో గుడ్లు పెడతాయి.పది రోజుల తర్వాత గుడ్లు పొదిగి ముదురు గోధుమ రంగులో గంగోలి పురుగు బయటకు వచ్చి చెట్టు బెరడును తిని కాండంలోకి తోలుచుకుపోయి సొరంగాలు చేస్తుంది.
పురుగు పరిమాణం పెరిగే కొద్దీ సోరంగ పరిమాణం కూడా పెరుగుతుంది.

ఉద్యాన తోటల్లో ఉండే మొక్క మొదలు దగ్గర చెక్కపొడి లాంటి పదార్థం కనిపించిన, బెరడు తుట్టేలకు రంద్రాలు కనిపించిన, కొమ్మను కదిలిస్తే బోలు శబ్దం వినిపించిన ఆ మొక్కను కాండం తొలిచే పురుగులు ఆశించినట్టే.పురుగుల ఉధృతి ఎక్కువైతే కొమ్మలు ఎండిపోయి చివరకు చెట్లు చనిపోయే అవకాశం ఉంది.

కాబట్టి ఉద్యానవన తోటలను సాగు చేసే రైతులు( Farmers ) జూలై నెలలో ఈ పురుగుల ఉనికిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.ఈ పురుగులు ఆశించిన కొమ్మలను తొలగించి కాల్చివేయాలి.గట్టి ఇనుప తీగను రంధ్రంలోకి చెప్పి పురుగులను బయటకి లాగి చంపేయాలి.
ఆ రంధ్రంలో పెట్రోల్ లో ముంచిన దూది ఉంచి బురదతో రంద్రం మూసేయాలి.ఇమిడా క్లోప్రిడ్( Imida Cloprid ) 17.8% ఎస్.ఎల్.1మి.లీ ను ఒక లీటరు నీటిలో కలిపి జూలై నెలలో 15 రోజుల వ్యవధిలో మూడు లేదా నాలుగు సార్లు పిచికారి చేయాలి.