చిరు జ్ఞాపకాలతో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన యాక్షన్ కింగ్!

కన్నడ చిత్ర సీమలో చిరంజీవి సర్జా కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు గానే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమ లో ఒక స్టార్ హీరో గా ఎదిగాడు.

 Action King Arjun Emotional Speech At Meghana Raj's Baby Shower Chiranjeevi Sar-TeluguStop.com

అయితే అలాంటి చిరంజీవి అతి చిన్న వయసులోనే(35) కన్ను మూసి అభిమానులను,కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచివేశారు.అయితే అక్టోబర్ 17 న చిరు జయంతి కావడం తో యాక్షన్ కింగ్ అర్జున్ కుటుంబ సభ్యుల మధ్య ఒక వేడుకను నిర్వహించారు.

ఈ వేడుకలో చిరు సతీమణి మేఘనా రాజ్ కూడా పాల్గొంది.ప్రస్తుతం మేఘనా గర్భవతి అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇటీవల ఆమె కుటుంబసభ్యులు,స్నేహితులు అందరూ కలిసి ఆమెకు సీమంతం వేడుకలు కూడా ఘనంగా నిర్వహించగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారాయి.ఆమె సీమంతం వేడుకల్లో సర్జా కట్ అవుట్ పక్కన పెట్టి మరి వేడుకలు నిర్వహించారు.

అయితే ఇప్పుడు తాజాగా సర్జా ఫ్యామిలీ అంతా కూడా ఆయన జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా సర్జా సతీమణి మేఘ‌నా రాజ్‌తో కేక్ క‌ట్ చేయించి ఆమెకు దీవెన‌లు అందించారు.కేక్ క‌ట్ చేసే స‌మ‌యంలో అంద‌రు హ్యాపీ బర్త్డ్‌డే అని కాకుండా.‘హ్యాపీ వెల్‌కమ్‌ టు యు, హార్ట్‌లీ వెల్‌కమ్‌ టు యు.డియర్‌ జూనియర్‌ చిరు.’ అని అందరూ అనాల్సిందిగా అర్జున్‌ కోరడం తో అలానే ఆమె కు అందరూ విషెస్ అందించారు.మేఘనా రాజ్ కూడా హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది.అయితే చిన్న వయసులోనే భ‌ర్త‌ని కోల్పోయి ఒంటరిగా ఉంటున్న మేఘ‌నాకు కొండంత ధైర్యాన్ని అందించారు అర్జున్.

ప‌రిస్థితులు ఎప్పుడు ఒక‌లా ఉండ‌వు, క‌ష్టాల‌ని అధిగ‌మిస్తూ ముందుకు సాగాలి.మేఘనా.ఒంటరినని నువ్వు ఎప్పుడూ అనుకోకు.నీ వెంట మేమంతా ఉన్నాం.

ప్రస్తుతం అలుముకున్న నెగిటివిటీని పాజిటివిటీగా మార్చేందుకు మా ఫ్యామిలీలోకి యాడ్‌ కాబోతోన్న మా జూనియర్‌ చిరుకు నవ్వుతూ స్వాగతం పలికేందుకే ఈ వేదికను ఏర్పాటు చేశాం.మేఘనా.

వచ్చి కేక్‌ కట్‌ చెయ్ అంటూ ఆయన ధైర్యం చెప్పారు.అయితే ఈ వేడుకకు సంబంధించిన వీడియోని మేఘనా రాజ్ త‌న ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి మరి పంచుకుంది.

కొన్ని సార్లు మనకు తెలియ‌కుండానే ప్రేమ‌ను పొందుతాం అంటూ ఆ వీడియో ను పోస్ట్ చేస్తూ కామెంట్ కూడా పెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube