తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది.ఈ మేరకు ఆరు గ్యారెంటీల అర్హులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులను స్వీకరించనుంది.
అభయహస్తం పేరుతో దరఖాస్తులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.ఢిల్లీ పర్యటన ముగియడంతో తెలంగాణకు బయలుదేరారు.ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.కాగా ఆరు గ్యారెంటీలకు ప్రజాపాలన పేరుతో ఒకటే దరఖాస్తు ఉండనుంది.ఇందులోనే మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి.ప్రజాపాలనలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో అధికారుల బృందం పర్యటిస్తుంది.
ప్రజలు దరఖాస్తులతో పాటు ఆధార్, తెల్లరేషన్ కార్డు జిరాక్సులను అధికారులకు అందించాల్సి ఉంటుంది.