బాలయ్య టైటిల్ తో సందడి చేయబోతున్న యాక్షన్ హీరో గోపీచంద్  

బంగారు బుల్లోడు టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న గోపీచంద్. .

Action Hero Gopichand Movie Title Bangaru Bullodu-

టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు గోపీచంద్.తొలివలపు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సరైన అవకాశాలు లేక వర్షం, నిజం లాంటి సినిమాల్లో విలన్ గా తనదైన ముద్ర వేసిన గోపీచంద్ మళ్లీ యజ్ఞం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కెరీర్ లో మొదటి సక్సెస్ కొట్టాడు తరువాత వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు.యాక్షన్ సినిమాలకు టాలీవుడ్ లో గోపీచంద్ బెస్ట్ ఛాయిస్ అనే విధంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఈ హీరో సొంతం చేసుకున్నాడు..

Action Hero Gopichand Movie Title Bangaru Bullodu--Action Hero Gopichand Movie Title Bangaru Bullodu-

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా గోపిచంద్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.లౌక్యం సినిమా తర్వాత సరైన హిట్ లేక డీలా పడ్డ గోపీచంద్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో ఓ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తున్నాడు.ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది ఇందులో గోపీచంద్ కి హీరోయిన్ గా అందాల భామ హన్సిక నటిస్తుంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ లో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.బాలకృష్ణ కెరియర్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచిపోయిన బంగారు బుల్లోడు సినిమా టైటిల్ ని గోపీచంద్ సినిమా కోసం వాడుకున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా కథాపరంగా బంగారు బుల్లోడు టైటిల్ సరిపోతుందని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.

మరి గోపీచంద్ ఈ సినిమాతో అయినా నా సూపర్ హిట్ కొట్టి తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో వేచి చూడాల్సిందే.