ప్రభుత్వ పాఠశాల అడ్డగా.. డ్రగ్స్ మత్తులో విద్యార్థులు.. ?

నేటి బాలలే రేపటి పౌరులు అని బోర్డు మీద రాయడానికే పనికి వస్తున్న ఈ పదాలను ఆచరించడంలో నేటి వ్యవస్ద విఫలం అవుతుందని సృష్టంగా అర్ధం అవుతుంది.పిల్లలు పసి వయస్సు నుండి క్రమశిక్షణతో పెరిగితే దేశానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటారు.

 Across The Public School Students Intoxicated With Drugs, Guntur, Thadepalli, Go-TeluguStop.com

లేదంటే సమాజాన్ని చీడపురుగుల్లా పట్టుకుని సర్వనాశనం చేస్తారు.వీరి వల్ల కన్న వారికి వేదన తప్పితే మిగిలేది ఏముండదు.

అందుకే ఒక మనిషి క్రమశిక్షణకు ముఖ్యదశగా బాల్యాన్ని చెబుతుంటారు.

ఇకపోతే గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు మత్తు పదార్థాలు సేవిస్తూ పట్టుబడటం స్దానికంగా కలకలం సృష్టిస్తుంది.

ఈ పాఠశాలలో చదివే విద్యార్ధులు కర్చీఫ్ లో మత్తు పదార్థాలు వేసుకుని సేవిస్తూ స్థానికుల కంటపడటంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళారట.దీంతో మత్తు పదార్థాలపై ఆరా తీసిన పోలీసుల విచారణలో తాడేపల్లి తోటలో పండే గంజాయి పంటతో కుర్రకారు మత్తులో జోగుతున్నట్లు బట్టబయలైందట.

ఇక్కడి విద్యార్థులకు మత్తు సరఫరా చేసేందుకు తాడేపల్లి అడ్డాగా మారిందని తేలిందట.అదీగాక ఈ ప్రభుత్వ పాఠశాలలో మరికొందరు విద్యార్ధులు కూడా మత్తు పదార్థాలు సేవిస్తున్నారని పట్టుబడిన విద్యార్థులు చెప్పడం ఆందోళన కలిగిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube