కాలం మారుతోంది.అందుకు తగ్గట్టే పరిస్థితులు కూడా మారుతున్నాయి.
మనిషి జీవన విధానంలో ఇప్పటికే ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ఇందులో భాగంగా నిత్యవసర వస్తువుల వాడకంలో వాటి ధరల్లో కూడా విపరీతంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఇప్పుడు కూడా ఓ వాటర్ బాటిల్ ధర గురించిన వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.నిజానికి మన జీవితంలో చూస్తున్న వాటర్ బాటిల్ ధర ఎంత ఉంటుంది చెప్పండి.
హా ఎంత మహా అయితే 20 నుంచి డిమాండ్‌ను బట్టి 100 ఉంటుంది కావచ్చు అంటారు కదా.
ఇక కొన్ని ఖరీదైన రెస్టారెంట్లలో దాన్ని ఇచ్చే బాటిల్ డిజైన్‌ను బట్టి నాలుగైదు వేల దాకా కూడా ఉండే ఛాన్స్ ఉంటుందని అందరికీ తెలిసిందే.
అయితే కేవలం 750 మిల్లీ లీటర్లు మాత్రమే ఉండే ఓ వాటర్ బాటిల్ ధర ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేస్తోంది.ఈ బాటిల్ దర ఏకంగా రూ.45 లక్షలు ఉంది.అదేంటి అంత ధర ఎందుకు.
అంతలా అందులో వాటర్ కాకుండా ఇంకేమైఆన ఉందా అని మీ డౌటు కదా.కానీ ఇందులో వాటర్ మాత్రమే ఉందండోయ్.
దీని పేరు అక్వా డిక్రిస్టలో ట్రిబ్యుటొ ఎ మోడిగ్లియాని అని తెలుస్తోంది.
అయితే ఇందులో ఉండే నీటిని ఫ్రాన్స్ ఫిజీలలోని సహజ నీటి బుగ్గల నుంచి ఆవిరి రూపంలో సేకరించి ఇందులో నింపుతున్నట్టు సమాచారం.
అయితే మాత్రం అంత రేటా అనుకోకండి.ఈ వాటర్‌ను రొటీన్‌కు భిన్నంగా తయారు చేయడం ఒక ఎత్తు అయితే ఈ బాటిల్ లోపల ఉండేటటువంటి భాగాన్ని ఏకంగా 24 క్యారెట్ల గోల్డ్‌తో రెడీ చేశారంట.
అందుకే దీనికి ఇంత రేట్ అని తెలుస్తోంది.అంతే కాదండోయ్ దీన్ని వరల్డ్ ఫేమస్ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో రెడీ చేశాడంట.ఇవన్నీ కలిసి ఇంత రేటు పలికినట్టు తెలుస్తోంది.
.