హీరో రామ్‎కు ఏసీపీ హెచ్చరికలు: విచారణకు ఆటంకం కలిగిస్తే నోటీసులు

విజయవాడ రమేష్ ఆస్పత్రి ప్రమాదానికి సంబంధించిన విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటి వారికైనా నోటీసులు ఇస్తామని ఏసీపీ సూర్యచంద్రరావు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఏసీపీ సూర్యచంద్రరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.

 Acp Warning To Hero Ram,vijayawada, Ramesh Hospital, Acp Surya Chandrarao, Hero-TeluguStop.com

రమేష్ ఆస్పత్రి వ్యవహారంలో ఇప్పటివరకు డాక్టర్ మమత, సౌజన్యలను విచారించామని తెలిపారు.రమేష్ చౌదరి అల్లుడు కల్యాణ్ చక్రవర్తి ఈ రోజు విచారణకు విచారణకు రావాల్సి ఉండగా.

, అనారోగ్య కారణాల వల్ల రెండు వారాలు క్వారంటైన్‎లో ఉండాల్సి వచ్చిందని వెల్లడించారు.కాగా, ఆయన ఆనారోగ్యం నిజమేనా.

కాదా.అనేది పరిశీలిస్తున్నామని సూర్యచంద్రరావు తెలిపారు.

ఈ కేసులో వయోవృద్ధులకు తప్ప విచారణ నుంచి ఎవరికి మినహాయింపు లేదని ఏసీపీ సూర్యచంద్రరావు స్పష్టం చేశారు.మిగిలిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాల్సిందేనని అన్నారు.

వృద్ధులైతే తామే వారి వద్దకు వెళ్లి విచారిస్తామని సూర్యచంద్రరావు వెల్లడించారు.ఈ కేసును తాము తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపడుతున్నామని.

ఈ కేసును తాము సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపారు.ఈ వ్యవహారంలో విచారణకు ఆటంకం కలిగించాలని చూస్తే హీరో రామ్‎కు సైతం నోటీసులు ఇస్తామని ఏసీపీ సూర్యచంద్రరావు హెచ్చరించారు.

ఇక డాక్టర్ రమేష్ కలెక్టర్ ఆఫీసుకు వచ్చి అక్కడి నుంచి పరారయ్యారని అన్నారు.డాక్టర్ రమేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నారని.

దొంగచాటుగా ఉండి ఆడియో టేపు విడుదల చేసి విచారణకు సహకరిస్తామని చెప్పడం సరికాదన్నారు ఏసీపీ సూర్యచంద్రరావు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube