ఆదర్శం : ప్రతి అమ్మాయి ఇలాంటి వ్యక్తిని భర్తగా కోరుకుంటారు, భార్య కోసం ఈయన చేసిన సాహసం వండర్‌  

A Chinese Man Travels In Asia Carrying Disabled Wife-bag Belt,chinese Man,motor Nuran Disease,wang Shayomin

భార్యకు చిన్న అనారోగ్యం చేస్తే ఆమెకు ఎవరు సేవ చేస్తారనే ఉద్దేశ్యంతో చాలా మంది ఆమె పుట్టింట్లో వదిలేస్తూ ఉంటారు.భర్తలు తామున్న బిజీతో భార్యలను పట్టించుకోరు.ఎంతగా అనారోగ్యంగా ఉన్నా కూడా చూయించుకోమంటూ డబ్బులు ఇచ్చే వారు ఎక్కువ ఉంటారు కాని ఆమెను హాస్పిటల్‌కు తీసుకు వెళ్లి చికిత్స చేయిద్దాం అనే ఆలోచన ఎవరికి రాదు...

A Chinese Man Travels In Asia Carrying Disabled Wife-bag Belt,chinese Man,motor Nuran Disease,wang Shayomin-A Chinese Man Travels In Asia Carrying Disabled Wife-Bag Belt Chinese Motor Nuran Disease Wang Shayomin

కాని చైనాకు చెందిన వాంగ్‌ షయోమిన్‌ మాత్రం ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప భర్తగా పేరు దక్కించుకున్నాడు.ప్రస్తుతం ఈయన గురించి సోషల్‌ మీడియాలో జనాలు తెగ చర్చించుకుంటున్నారు.

A Chinese Man Travels In Asia Carrying Disabled Wife-bag Belt,chinese Man,motor Nuran Disease,wang Shayomin-A Chinese Man Travels In Asia Carrying Disabled Wife-Bag Belt Chinese Motor Nuran Disease Wang Shayomin

ఆమె చనిపోతుందని తెలిసినా కూడా ఆమె కోసం వాంగ్‌ షయోమిన్‌ చేస్తున్న ప్రయత్నం అందరిని అబ్బుర పర్చుతోంది.57 ఏళ్ల వయసులో వాంగ్‌ మొదలు పెట్టిన ప్రయాణం అందరికి ఆదర్శం.తన భార్య గతంలో తన కోసం చేసిన సేవను గుర్తించిన వాంగ్‌ ఆమెకు బాగాలేని సమయంలో ఇప్పుడు ఆమె కోసం తన పూర్తి సమయంను కేటాయిస్తున్నాడు..

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చైనాకు చెందిన 57 ఏళ్ల వాంగ్‌ షయోమిన్‌ భార్యకు అయిదు సంవత్సరాల క్రితం మోటార్‌ న్యూరాన్‌ సంబంధిత వ్యాధి వచ్చింది.దాంతో అప్పటి నుండి ఆమె మెల్ల మెల్లగా నడవలేక పోతూ వస్తుంది.

ఈమద్య కాలంలో ఆమె అసలు నడిచే స్థితిలో లేదు.ఆమె అనారోగ్యం మెల్ల మెల్లగా క్షీణిస్తుందని, ఆమె ఎక్కువ కాలం బతకలేక పోవచ్చు అంటూ వైధ్యులు అతడితో చెప్పారు.దాంతో తన భార్యను సంతోష పెట్టాలని అతడు భావించాడు.

తన వద్ద ఎక్కువ డబ్బులు లేకున్నా కూడా ఉన్నంతలో ఆమెను సంతోషంగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు.

దాదాపు ఆరు పదుల వయసుకు వచ్చిన వాంగ్‌ 40 కేజీల బరువుతో గుట్టలు, పర్వాతాలు ఎక్కడం అంటే మామూలు విషయం కాదు.కాని అతడు తన భార్య ఆరోగ్యం మెరుగుపడుతుందేమో అనే ఉద్దేశ్యంతో చైనాలోనే అతి పెద్దదైన పర్వతాల్లో ఒక్కటైనా పర్వతంకు తాజాగా తీసుకు వెళ్లాడు.ఆ పర్వతంను ఎక్కడం దిగడం మామూలుగానే చాలా కష్టం.అలాంటిది భార్యను వీపున పెట్టుకుని ఏకంగా పర్వతంను ఎక్కడంతో పాటు చాలా జాగ్రత్తగా వాంగ్‌ దిగడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం...

భార్య పట్ల అంత ప్రేమ ఉన్న వాంగ్‌ లాంటి వ్యక్తులు తమకు భర్తలుగా రావాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు.చైనాలో స్థానికంగా ఈ విషయం చాలా ఫేమస్‌ అయ్యింది.అంత ప్రేమగా చూసుకునే భర్తలు తమకు కావాలి అంటూ అమ్మాయిలు కోరుకుంటున్నట్లుగా ఒక సోషల్‌ మీడియా సర్వేలో వెళ్లడయ్యింది.

వాంగ్‌లా పర్వతాలు ఎక్కించుకున్నా కూడా సంతోషంగా ఉంచినా చాలని అమ్మాయిలు అంటున్నారు.