అచ్చెన్న‌కు ఇటు గుడ్ న్యూస్‌.. అటు షాకింగ్ న్యూస్‌..!

మాజీ మంత్రి, టెక్క‌లి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు గుడ్ న్యూస్‌.షాకింగ్ న్యూస్‌లు వ‌రుస‌గా వ‌స్తున్నాయి.

 One Good News And One Bad News For Atchennanaidu, Tdp, Chandra Babu Naidu, Atche-TeluguStop.com

ఆయ‌న్ను చంద్ర‌బాబు ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా నియ‌మించారు.అయితే అచ్చెన్న సంబ‌రాలు చేసుకుంటానంటే కుదిరేలా లేదు.

టెక్క‌లిలో నాలుగు ద‌శాబ్దాలుగా రాజ‌కీయం చేస్తోంది కింజార‌పు ఫ్యామిలీ.ముందు దివంగ‌త ఎర్ర‌న్నాయుడు.

ఆ త‌ర్వాత అచ్చెన్నాయుడు అక్క‌డ ఎమ్మెల్యేలుగా వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ వ‌స్తున్నారు.గ‌తంలో ర‌ద్ద‌యిన హ‌రిశ్చంద్రా పురం నుంచి దివంగ‌త ఎర్ర‌న్నాయుడు వ‌రుస విజ‌యాలు సాధించారు.

ఆ త‌ర్వాత ఆ నియోజ‌క‌వ‌ర్గం టెక్క‌లిగా రూపాంత‌రం చెంద‌డంతో అచ్చెన్న అక్క‌డ త‌న అన్న వార‌స‌త్వం నిలుపుకుంటూ వ‌స్తున్నారు.గ‌త యేడాది ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ చిత్తుగా ఓడిపోయినా కేవ‌లం 23 సీట్ల‌తో స‌రిపెట్టుకుంది.

ఇందులో అచ్చెన్నాయుడు కూడా విజ‌యం సాధించారు.అచ్చెన్నుకు చంద్ర‌బాబు రాష్ట్ర స్థాయి పార్టీ అధ్య‌క్షుడి ప‌గ్గాలు ఇచ్చినా టెక్కలిలో అధికార పార్టీ అచ్చెన్న‌కు బిగ్ షాక్ ఇచ్చింది.

Telugu Atchenna, Chandra Babu, Jagan, Killi Kruparani, Tdp-Telugu Political News

ఆ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌ల్లో దువ్వాడ శ్రీనివాస్‌కు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు ఇవ్వ‌గా .ఇప్పుడు ఆయ‌న అక్క‌డ అన‌ధికారిక ఎమ్మెల్యేగా చ‌క్రం తిప్పుతున్నారు.ఇక గ‌త ఎన్నిక‌ల్లో అచ్చెన్న‌పై ఓడిపోయిన పేరాడ తిల‌క్‌ను క‌లింగ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌ను చేశారు.దీంతో ఈ ఇద్ద‌రు నేత‌ల‌తో ఇప్పుడు అచ్చెన్న‌కు ద‌బిడి దిబిడి అయిపోతోంది.

ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళం జిల్లా పార్ల‌మెంట‌రీ పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్నారు.ఆమె రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యే ఛాన్సులు ఉన్నాయి.

మొత్తానికి అచ్చెన్న‌ను ఢీకొట్టేందుకు జ‌గ‌న్ వేసిన ఈ ట్ర‌యాంగిల్ స్కెచ్ ఆయ‌న రాజ‌కీయాన్ని స‌వాల్ చేసేలా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube