అఫీషియల్: ధర్మస్థలి తలుపులు తెరుచుకునేది అప్పుడే!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

 Acharya Teaser To Be Out On Jan 29, Acharya, Chiranjeevi, Acharya Teaser, Korata-TeluguStop.com

ఇక ఈ సినిమాలో చిరంజీవి వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు, ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది.కాగా ఎండోమెంట్ ఆఫీసర్ పాత్రలో మెగాస్టార్ ఈ సినిమాలో మనకు కనిపిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే అంశానికి నిన్న చిత్ర యూనిట్ ఓ నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే.కాగా తాజాగా ఆచార్య చిత్ర టీజర్‌ను జనవరి 29న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా తెలిపింది.ధర్మశాల తలుపులు తెరుచుకునేది అప్పుడే అంటూ ఆచార్య చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సినిమా కోసం ఆచార్య చిత్ర యూనిట్ చాలా తీవ్రంగా కష్టపడుతుందని, ఈ సినిమాలో ప్రేక్షకులకు తమ కష్టం కనిపిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.ఇక ఈ చిత్ర టీజర్ రిలీజ్ విషయంపై నిన్న చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు సిద్ధ అని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండగా ఆయన సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube