ఆచార్య సర్ ప్రైజ్.. సోనూసూద్‌ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సోనూసూద్ ఈ పేరు వింటేనే కరోనా కష్టకాలంలో అడిగిన ప్రతి ఒక్కరికి అతను చేసిన సహాయం గుర్తుకొస్తుంది.ఎవరి పట్ల ఎలాంటి వివక్షత లేకుండా ఎంతోమందికి ఆపదలో సహాయం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టిన సోనుసూద్ అందరి గుండెల్లో రియల్ హీరోగా స్థానం సంపాదించుకున్నారు.

 Acharya Surprise Sonu Sood Should Be Shocked To See The Look-TeluguStop.com

రీల్ లో విలక్షణ పాత్రలో నటించే సోనూసూద్ మంచి మనసు కరోనా సమయంలో అతనిని రియల్ హీరోగా నిలబెట్టింది.ఈ విధంగా ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్న సోనుసూద్ జులై 30 న పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే తమ అభిమాననటుడికి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

 Acharya Surprise Sonu Sood Should Be Shocked To See The Look-ఆచార్య సర్ ప్రైజ్.. సోనూసూద్‌ లుక్ చూస్తే షాక్ అవ్వాల్సిందే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక సినిమాల విషయానికి వస్తే సోనుసూద్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో సోనుసూద్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.అయితే అతని పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమాలోని అతని పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేస్తూ.”బంగారం లాంటి మనసున్న విలక్షణ నటుడు సోనుసూద్ కి ఆచార్య చిత్ర బృందం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోనుసూద్ లుక్‌ ని రిలీజ్‌ చేశారు.

Telugu Acharya, Acharya Movie Update, Chiranjeevi, Kajal, Key Role, Koratala Siva, New Look, Pooja Hegde, Ram Charan, Social Media, Sonu Sood, Sonusood Acarya Look, Sonusood Birthday-Movie

ఈ లుక్‌ లో సోను నుదుటిన బొట్టు పెట్టుకుని పిలకతో ఎంతో డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.ప్రస్తుతం సోనుసూద్ ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు తన కొడుకు చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Telugu Acharya, Acharya Movie Update, Chiranjeevi, Kajal, Key Role, Koratala Siva, New Look, Pooja Hegde, Ram Charan, Social Media, Sonu Sood, Sonusood Acarya Look, Sonusood Birthday-Movie

ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇందులో మెగాస్టార్ సరసన కాజల్ సందడి చేయగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

#Key Role #Ram Charan #AcharyaMovie #Kajal #SonusoodAcarya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు