ఆచార్య సిద్ధ టీజర్.. లాస్ట్ షాట్ గూస్ బంప్స్..!

Acharya Siddha Teaser Last Shot Goosebumps

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా నుండి సిద్ధ టీజర్ వచ్చేసింది.సినిమాలో సిద్ధ పాత్రలో రాం చరణ్ నటిస్తున్నాడు.

 Acharya Siddha Teaser Last Shot Goosebumps-TeluguStop.com

సినిమాలో ఈ పాత్ర చాలా కీలకమని తెలుస్తుంది.ఆచార్య సిద్ధ టీజర్ లో చరణ్ లుక్స్, స్టైల్ అదిరిపోయాయి.

ఓ పక్క ధర్మస్థలిని కాపాడే వ్యక్తిగా కనిపించిన చరణ్ కట్ చేస్తే అడవిలో తుపాకి పట్టుకుని అన్నగా మారాడు.మరి సిద్ధ పాత్ర ఎలా ఉంటుంది అన్నది శాంపిల్ చూపించగా చిరు ఆచార్య లో చరణ్ అదరగొట్టాడని మాత్రం అర్ధమవుతుంది.

 Acharya Siddha Teaser Last Shot Goosebumps-ఆచార్య సిద్ధ టీజర్.. లాస్ట్ షాట్ గూస్ బంప్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక టీజర్ చివర్లో పులి పిల్ల నీళ్లు తాగుతుంటే పెద్ద పులి కాపలా కాస్తుంటుంది.మరో పక్క అదే కొలనులో చరణ్ నీళ్లు తాగుతుంటే చిరంజీవి అటు ఇటు తిరుగుతాడు.ఈ ఒక్క షాట్ చాలు మెగా ఫ్యాన్స్ కు ఈ సినిమా ఏ రేంజ్ ట్రీట్ ఇవ్వబోతుంది అని చెప్పడానికి.కచ్చితంగా మెగా ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకునేలా ఈ సినిమా ఉంటుందని ఈ టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

కాజల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా 2022 ఫిబ్రవరి 4న రిలీజ్ ప్లాన్ చేశారు.ఆచార్య సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.ఇప్పటికే సినిమా నుండి రిలీజైన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

#Koratala Siva #Chiranjeevi #MegapowerRam #Charan #AcharyaSiddha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube