హమ్మయ్య.. ఎట్టకేలకు ఆచార్య ఆరంభిస్తున్నాడు!  

Acharya Shooting From November Third Week, Acharya, Chiranjeevi, Koratala Siva, Kajal, Tollywood News - Telugu Acharya, Acharya Shooting From November Third Week, Chiranjeevi, Kajal, Koratala Siva, Ramcharan, Tollywood News

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఆచార్య ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

TeluguStop.com - Acharya Shooting From November Third Week

అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా ప్రభావంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభమవడంతో ఆచార్య ఎప్పుడు షూటింగ్ తిరిగి మొదలుపెడతాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

కానీ చిరంజీవి మాత్రం ఈ సినిమా షూటింగ్‌కు ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో కొరటాల అండ్ టీమ్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఇప్పటికే ఆచార్య చిత్రం అనుకున్న సమయానికంటే ఎక్కువ ఆలస్యం అయ్యిందని, మరింత ఆలస్యం అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతుందని చిత్ర యూనిట్ చిరుకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.

TeluguStop.com - హమ్మయ్య.. ఎట్టకేలకు ఆచార్య ఆరంభిస్తున్నాడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో ఆయన ఎట్టకేలకు ఆచార్య చిత్ర షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.ఇక నవంబర్ మూడో వారం నుండి ఆచార్య చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు కొరటాల అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

చిరు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించనున్న ఆచార్య చిత్రాన్ని కొరటాల శివ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా చిరు సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించిన తరువాత వీలైనంత త్వరగా పూర్తి చేసేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.

ఈసారైనా అనుకున్న సమయానికి ఆచార్య షూటింగ్ ముగుస్తుందా లేదా అనే సందేహం మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో నెలకొంది.మరి ఈ సినిమా షూటింగ్ ఈసారైనా ఖచ్చితంగా మొదలవుతుందా లేదా అనేది చూడాలి.

#Chiranjeevi #Koratala Siva #AcharyaShooting #Kajal #Ramcharan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Acharya Shooting From November Third Week Related Telugu News,Photos/Pics,Images..