మెగా 152 ‘ఆచార్య’ కాదా?

మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రంకు ఆచార్య అంటూ టైటిల్‌ను ఖరారు చేశారని అంతా అనుకుంటున్నారు.ఒక సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక సందర్బంగా చిరంజీవి ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాకు ఆచార్య అంటూ టైటిల్‌ను పెట్టినట్లుగా నోరు జారి చెప్పాడు.

 Acharya Not Fix The Mega 152 Movie-TeluguStop.com

అధికారికంగా చెప్పకుండానే చిరు నోరు జారడంతో టైటిల్‌ కాస్త రివీల్‌ అయ్యింది.అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్య టైటిల్‌ కన్ఫర్మ్‌ అవ్వలేదని అంటున్నారు.

Telugu Acharya, Chiranjeevi, Koratala Siva-Movie

ఆచార్య ఇంకా గోవింద ఆచార్య టైటిల్స్‌తో పాటు ఇంకా కొన్ని టైటిల్స్‌ను పరిశీలిస్తున్న సమయంలో ఆచర్య టైటిల్‌తో సినిమాను ప్రచారం చేస్తున్నారు.అంతే తప్ప టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని అంటున్నారు.దర్శకుడు కొరటాల శివ టైటిల్‌ విషయంలో ఇంకా ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఆచార్య కంటే బెటర్‌ ఏమైనా ఆలోచన వస్తే తప్పకుండా దానికే వెళ్లాలని చిరంజీవితో పాటు కొరటాల కూడా భావిస్తున్నాడట.

చిరంజీవి రివీల్‌ చేసిన టైటిల్‌ కనుక దాన్నే కంటిన్యూ చేస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా కొరటాల శివ మాత్రం ఇంకా దానికి ఫిక్స్‌ అవ్వలేదని అంటున్నారు.చాలా స్పీడ్‌గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆగస్టులో సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube