'ఆచార్య' తండ్రి కొడుకులు పుకారుపై కొరటాల శివ క్లారిటీ

మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా పై మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా లోని రామ్‌ చరణ్ పాత్ర సినిమా పై అంచనాలు మరింతగా పెచించింది.

 Acharya News About Ram Charan And Chiranjeevi Roles Clarity Koratala Shiva , Ach-TeluguStop.com

చిరంజీవికి జోడీగా కాజల్ నటిస్తుండగా రామ్‌ చరణ్‌ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.భారీ అంచనాలున్న ఈ సినిమా లో చరణ్ మరియు చిరంజీవి తండ్రి కొడుకులు గా కనిపించబోతున్నట్లుగా ఒక వర్గం మీడియా మొదటి నుండి జోరుగా ప్రచారం చేస్తుంది.

కాని మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.ఎట్టకేలకు ఆ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందించారు.

ఏకంగా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా పై వస్తున్న పుకార్ల విషయంలో స్పష్టత ఇచ్చాడు.

కొరటాల శివ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఆచార్య సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఇదే సమయంలో కొరటాల శివ మాట్లాడుతూ ఆచార్య సినిమా లో చరణ్ పాత్ర ఖచ్చితంగా అభిమానులు మెచ్చే విధంగా నచ్చే విధంగా ఉంటుందని అన్నాడు.అలాగే చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ లు తండ్రి కొడుకులుగా నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని అన్నాడు.

ఇద్దరు కూడా గురు శిష్యుల సంబంధం ను కలిగి ఉంటారని పేర్కొన్నాడు.ఇద్దరి కాంబో సన్నివేశాలు మెగా ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే ఉంటాయని కూడా పేర్కొన్నాడు.మొత్తానికి చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ ల కాంబో సన్నివేశాలు అబ్బ అన్నట్లుగా ఆయన చిత్రీకరించినట్లుగా చెప్పకనే చెప్పాడు.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చి ఉండకుంటే ఇప్పటికే సినిమా విడుదల అయ్యేది.కాని షూటింగ్ ఆలస్యం అవుతోంది.

దసరా వరకు ఈ సినిమా విడుదల అయ్యేనో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube