ఈ నెల 12 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాయామ కళాశాలల్లో ప్రవేశాల కొరకు *పీసెట్*ఎంపికలు....

ఈ నెల 12 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాయామ కళాశాలలో ప్రవేశాలకు పీ సెట్ ఎంపికలు జరగనున్నాయి.కొవిడ్‌ నిబంధనల మేరకు వీటిని నిర్వహించనున్నట్టు కన్వీనర్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జాన్సన్‌ గురువారం చెప్పారు.

 Acharya Nagarjuna University Conduct Press Meet About P Set Selections, Acharya-TeluguStop.com

మొత్తం 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని, రోజుకు 500 మంది మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.ఏఎన్‌యూ క్రీడామైదానంలో ఈ పోటీలు జరుగుతాయని, ఈనెల 5 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

పురుషులకు 100, 800 మీటర్ల పరుగుపందేల్లో ఒకటి, హైజంప్‌, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌లలో ఒకటి, అలాగే అభ్యర్థి ఎంచుకున్న క్రీడాంశంలో ఈ పోటీలుంటాయన్నారు.అలాగే మహిళలు 100, 400 మీటర్ల పరుగు పందేల్లో ఒకటి, హైజంప్‌, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌లలో ఒకటి, ఎంచుకున్న క్రీడాంశంలో పాల్గొనాల్సి ఉంటుందని చెప్పారు.

పీసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు కచ్చితంగా తమ విద్యార్హత పత్రాలు, మెరిట్‌ ధ్రువపత్రాల నకళ్లను తీసుకురావాలని కన్వీనర్‌ చెప్పారు.వారు సాధించే స్కోరు ప్రకారమే ర్యాంకులు కేటాయిస్తామని ఆయన తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube