ఆచార్య ముందు రంగస్థలం తక్కువేనట!  

Acharya Movie To Be More Powerful Than Rangasthalam - Telugu Acharya, Ram Charan, Rangasthalam, Sukumar, Telugu Movie News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండటో చరణ్ ఈ లుక్‌లో ఎలా ఉంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Acharya Movie To Be More Powerful Than Rangasthalam - Telugu Acharya, Ram Charan, Rangasthalam, Sukumar, Telugu Movie News-Gossips-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమాలో నటిస్తూనే ప్రొడ్యూసర్‌గా చరణ్ తన నెక్ట్స్ మూవీని కూడా రెడీ చేస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రాన్ని చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ కూడా ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఈ పాత్ర రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ అయిన రంగస్థలంలో కంటే కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.

కొరటాల శివ ప్రత్యేకంగా చరణ్‌ కోసం ఈ పాత్రను రాసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో చరణ్ ఓ నక్సలైట్‌గా నటిస్తాడని, ఈ పాత్రతో రంగస్థలం చిత్రంలోని చిట్టిబాబు పాత్రను మరపిస్తాడని తెలుస్తోంది.

చిరు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో చిరు డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడని, ఇదొక మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది.మరి ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు విశ్లేషకులు.

తాజా వార్తలు