ఆచార్య అప్డేట్ : అడవి బాట పట్టిన తండ్రీకొడుకులు...

తెలుగులో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొణిదెల బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

 Acharya Movie Shooting Update Shared By Nagababu-TeluguStop.com

కాగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా టాలీవుడ్ బ్యూటిఫుల్ చందమామ “కాజల్ అగర్వాల్” నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అలాగే బుట్ట బొమ్మ “పూజా హెగ్డే” ఇతరులు గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో నటిస్తున్నారు.కాగా ఈ చిత్రం కోసం దాదాపు 140 కోట్ల రూపాయల బడ్జెట్ వెచ్చిస్తున్నట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ చిత్రంలోని షూటింగ్ స్టిల్స్ ని ప్రముఖ సినీ నిర్మాత మరియు నటుడు నాగబాబు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు.అంతేగాక ఈ ఫోటోలకు “కమాండర్ అండ్ కామ్రేడ్ ఛార్జింగ్ ఫర్ ద స్ట్రైక్.

 Acharya Movie Shooting Update Shared By Nagababu-ఆచార్య అప్డేట్ : అడవి బాట పట్టిన తండ్రీకొడుకులు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బ్రేస్ ఫర్ ఇంపాక్ట్” అంటూ పవర్ ఫుల్ క్యాప్షన్ కూడా పెట్టాడు.దీంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అంతేకాకుండా “ఒకే ఫ్రేములో రెండు సింహాలు” అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇంకొందరైతే తండ్రి కొడుకుల దెబ్బకి బాక్సాఫీస్ బద్దలు కానుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ నిలిపివేయడంతో చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్న సమయానికి షూటింగ్ పనులు పూర్తి చేయలేక పోయారు.దీంతో ఇప్పటికే ఈ చిత్ర విడుదల రెండు సార్లు వాయిదా పడింది.దీంతో ఈసారి ఎలాగైనా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ పనులను త్వరగతిన ముగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

#Acharya #Nagababu #Ram Charan Tej #AcharyaShared #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు