'ఆచార్య' ఆ పది తో మొత్తం పూర్తి.. చిరు రావడమే ఆలస్యం అంటున్న కొరటాల

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ కేవలం 10 రోజులు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

 Acharya Movie Shooting Update-TeluguStop.com

మొన్నటి వరకు సోనూసూద్‌ మరియు ఇతర యూనిట్‌ సభ్యులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది.ఇక బ్యాలన్స్ షూటింగ్ ను త్వరలో నే పూర్తి చేస్తామని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్‌ ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమాను వచ్చే నెల 14న విడుదల చేయాలని మొదట భావించారు.

 Acharya Movie Shooting Update-ఆచార్య’ ఆ పది తో మొత్తం పూర్తి.. చిరు రావడమే ఆలస్యం అంటున్న కొరటాల-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా సినిమాను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

షూటింగ్‌ విషయంలో అందుకే మెల్లగా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.

ఆచార్య ను ముగించేసి వచ్చే నెల నుండి ఎన్టీఆర్‌ తో సినిమాను కొరటాల శివ పట్టాలెక్కించే అవకాశం ఉందంటున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆచార్య సినిమాలో చరణ్‌ కూడా నటిస్తున్న కారణంగా మరింతగా అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్‌ నటించగా చరణ్‌ కు జోడీగా ముద్దుగుమ్మ పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే.మణిశర్మ సంగీత దర్శకత్వంలో ఈ సినిమా లోని పాటలు రాబోతున్నాయి.

ఇప్పటికే వచ్చిన లాహె లాహె పాట మంచి హిట్‌ టాక్ ను దక్కించుకుంది. చిరంజీవి ఈ సినిమా లో నక్సలైట్‌ గా కనిపిస్తాడనే వార్తలు వస్తున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా లో మాస్ మసాలా ఎలిమెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే సెంటిమెంట్‌ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

#Kajal Agarwal #Chiranjeevi #Ram Charan #Koratala Shiva #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు