ఆచార్య ముందున్న ఆప్షన్‌ ఆమె మాత్రమేనా?

మెగాస్టార్‌ సినిమాలో హీరోయిన్‌ అవకాశం అంటే ఎవరైనా ఎగిరి గంతేసి మరీ ఒప్పుకుంటారు.కాని త్రిష మాత్రం షూటింగ్‌లో కొన్ని రోజులు పాల్గొన్న తర్వాత బాబోయ్‌ నా వల్ల కాదు అంటూ తప్పుకుంది.

 Acharya Movie Latest Update About Actress-TeluguStop.com

చిత్ర యూనిట్‌ సభ్యులపై విమర్శలు చేస్తూ మరీ ఆమె తప్పుకుంది.త్రిష తప్పుకోవడంతో వెంటనే మరో హీరోయిన్‌ను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవికి జోడీగా ఇప్పటికిప్పుడు అంటే ఠక్కున కనిపించేది కాజల్‌ మాత్రమే అంటున్నారు.

చిరంజీవికి జోడీగా ప్రస్తుతం కాజల్‌ తప్ప మరెవ్వరు లేరు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఖైదీ నెం.150 చిత్రంలో చిరంజీవికి జోడీగా నటించిన కాజల్‌ అగర్వాల్‌ మళ్లీ ఈ సినిమాతో నటించేందుకు ఓకే చెప్పే అవకాశం ఉందని అంటున్నారు.అయితే కాజల్‌ అవకాశాలు లేకున్నా కూడా పారితోషికం మాత్రం చాలా డిమాండ్‌ చేస్తుందని అంటున్నారు.అంత పారితోషికంను బేర్‌ చేసి మరీ ఈ అమ్మడిని నటింపజేస్తారా లేదంటే మరెవ్వరినైనా చూస్తారా చూడాలి.

Telugu Acharya Latest, Chiranjeevi, Indian, Kajal Indian, Kajal Agarwal, Koratal

ప్రస్తుతం కాజల్‌ ఇండియన్‌ 2 చిత్రంలో మినహా మరే సినిమాలో కూడా నటించడం లేదు.ఇండియన్‌ 2 చిత్రం కూడా యాక్సిడెంట్‌ కారణంగా ఆగిపోయింది.ఎప్పటికి షూటింగ్‌ ప్రారంభం అయ్యేది ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి.ఇలాంటి సమయంలో ఈ అమ్మడు చిరంజీవి సినిమాకు ఓకే చెప్తే కాస్త అయినా బిజీ అయ్యే అవకాశం ఉంది.

మరి పారితోషికం డిమాండ్‌ చేసి ఛాన్స్‌ వదులుకుంటుందా లేదంటే ఈ అమ్మడు సినిమా చేస్తుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube