సిద్ధ కౌగిలిలో నీలాంబరి.. ఆచార్య నుండి బిగ్ అప్డేట్ !

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ చేస్తున్న సినిమాల్లో ‘ఆచార్య’ సినిమా ఒకటి.ఈ సినిమా మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతుంది.

 Acharya Movie Latest Update, Acharya, Chiranjeevi, Ram Charan, Kajal Agrwal, Poo-TeluguStop.com

ఇందులో చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

చిరంజీవి కెరీర్ లో 152 వ సినిమాగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై అభిమానులు పెద్ద అంచనాలనే పెట్టుకున్నారు.

ఇందులో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.

రామ్ చరణ్ కు జతగా పూజా హెగ్డే నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా ప్రచార చిత్రాలు, టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి.అలాగే ఫస్ట్ సింగిల్ ‘లాహె లాహె’సాంగ్ ప్రేక్షకులను బాగా అలరించింది.

ఇక ఇప్పుడు మరొక పాటను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఆచార్య సినిమాలో పూజా హెగ్డే నీలబారి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ పేరుతోనే నవంబర్ 5వ తేదీన ఉదయం 11.07 నిముషాలకు విడుద చేయనున్నట్టు ప్రకటించారు.ఈ సాంగ్ రామ్ చరణ్, పూజ హెగ్డే మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తుంది.ఈ మేరకు ఒక పోస్టర్ కూడా వదిలారు.

Telugu Acharya, Acharya Latest, Chiranjeevi, Koratala Siva, Kajal Agrwal, Navemb

ఈ పోస్టర్ లో మురారి వాయిస్తున్న అందాల నీలాంబరి సిద్ధ ఎదలో నీలాంబరి ఒదిగిపోయి కనిపించింది.ఈ పోస్టర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.వీరిద్దరి పెయిర్ కూడా చూడడానికి అందంగా ఉంది.ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాను 2022 ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube