ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడేనా?  

Acharya Movie First Look Release Date Fixed - Telugu Acharya, Chiranjeevi, Chiru152, Koratal Siva, Ram Charan

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్న సమయంలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్ నిలిపివేయడం జరిగింది.

 Acharya Movie First Look Release Date Fixed

ఇక ఈ సినిమా టైటిల్‌ను ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఉగాది కానుకగా రిలీజ్ చేయాలని భావించారు.

ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే అదే రోజు ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయడంతో ఆ సినిమాతో పోటీ ఏర్పడుతుందని ఆచార్య ఫస్ట్ లుక్‌ను వాయిదా వేశారు.ఇక రామ్ చరణ్ పుట్టిన రోజున రిలీజ్ చేయాలనుకుంటే ఆ రోజు ఆర్ఆర్ఆర్‌లోని చరణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ రిలీజ్ అయ్యింది.

దీంతో ఇప్పుడు ఆచార్య ఫస్ట్ లుక్‌ను శ్రీరామనవమి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇక ఆచార్య ఫస్ట్ లుక్‌ ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయమని తెలుస్తోంది.

చిరంజీవి రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Acharya Movie First Look Release Date Fixed Related Telugu News,Photos/Pics,Images..