బర్త్‌ డే స్పెషల్‌ : 'మిర్చి' నుండి 'ఆచార్య' వరకు ఆయన వెరీ స్పెషల్‌

రచయితగా పదేళ్లకు పైగా ఎన్నో సినిమాలకు రాసిన కొరటాల శివ మిర్చి సినిమా తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.ప్రభాస్‌ హీరోగా నటించిన మిర్చి సినిమా ను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు.

 Acharya Movie Director Koratala Shiva Happy Birthday-TeluguStop.com

ఆ సినిమా మొదలుకుని ఆచార్య సినిమా వరకు కొరటాల శివ తన స్థాయిని పెంచుకుంటూనే ఉన్నాడు.ఇప్పటి వరకు అపజయం లేకుండా సూపర్ హిట్ లు తెరకెక్కిస్తున్నాడు.

ఆచార్య సినిమా కాస్త ఆలస్యం అయ్యింది కాని అంతకు ముందు చేసిన సినిమా లు అన్ని కూడా బాక్సాఫీస్‌ వద్దకు వెంట వెంటనే వచ్చేశాయి.ఆచార్య సినిమా చిరంజీవి సైరా సినిమా తో పాటు కరోనా వల్ల దాదాపుగా రెండున్నర ఏళ్లు ఆలస్యం అయ్యింది.

 Acharya Movie Director Koratala Shiva Happy Birthday-బర్త్‌ డే స్పెషల్‌ : మిర్చి’ నుండి ఆచార్య’ వరకు ఆయన వెరీ స్పెషల్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆచార్య సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి.అంచనాలు మించి ఈ సినిమా ఉంటుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు.

ఇప్పటి వరకు కొరటాల శివ అపజయం అనేది లేకుండా దూసుకు పోతున్నాడు.ఆ కారణంతో పాటు మెగా స్టార్‌ చిరంజీవి మంచి ఫామ్‌ లో ఉన్నాడు.

దానికి తోడు ఈ సినిమాలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.రామ్‌ చరణ్ హీరోగా నటించిన సినిమా ల్లో చిరంజీవి చిన్న గెస్ట్‌ రోల్‌ కే ఆహా ఓహో అన్నారు.

ఇప్పుడు ఏకంగా ఆచార్య లో చరణ్‌ కీలక పాత్రలో నటించాడు.అంతే కాదు ఆయన హీరోయిన్ మరియు పాటలు కూడా ఉంటాయి.

కనుక సినిమా మరో రేంజ్‌ లో ఉంటుందని అంతా బలంగా నమ్ముతున్నారు.

Telugu Acharya, Chiranjeevi, Film News, Koratala Shiva, Koratala Shiva New Film, Mirchi Movie, Ntr30 Film-Movie

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న కారణంగా అంతకు మించి అన్నట్లుగా బడ్జెట్‌ ఖర్చు చేస్తూ సినిమా ను రూపొందిస్తున్నాడు.టెంపుల్‌ సిటీ తో పాటు మరిన్ని అద్బుత సెట్టింగ్‌ లతో ఆచార్య ను కలర్‌ ఫుల్‌ గా మార్చేశాడు.ఆచార్య తర్వాత ఎన్టీఆర్‌ సినిమా ను చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఆ తర్వాత బన్నీ తో కూడా కొరటాల శివ సినిమా ఉంటుంది.నేడు కొరటాల బర్త్‌ డే.అపజయం ఎరుగని ఆయనకు మరిన్ని బ్లాక్ బస్టర్స్ దక్కాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్‌ డే కొరటాల శివ గారు.

#Koratala Shiva #Acharya #KoratalaShiva #Chiranjeevi #Ntr30 Film

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు