సంక్రాంతికి ఆచార్య షాక్.. పోస్టర్ వస్తుందనుకుంటే పోస్ట్ పోన్ న్యూస్ వచ్చింది..!

Acharya Again Postpone Mega Fans Pongal Shock

పండుగకి మెగా ఫ్యాన్స్ కు గట్టి షాక్ తగిలింది.ఇప్పటికే ఆర్.

 Acharya Again Postpone Mega Fans Pongal Shock-TeluguStop.com

ఆర్.ఆర్ సినిమా వాయిదా పడ్డదని బాధపడుతుండగా ఫిబ్రవరి 4న రిలీజ్ అనుకున్న ఆచార్య సినిమాని వాయిదా వేస్తూ ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు ఆచార్య టీం.ప్రస్తుతం కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న కారణంగా పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు.మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కిన ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కూడా నటించారు.

సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.మణిశర్మ మ్యూజిక్ అందించిన సినిమాలోని రిలీజైన సాంగ్స్ అన్ని ప్రేక్షకులను అలరించాయి.సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి సినిమా నుండి పోస్టర్ వస్తుందని భావించిన ఫ్యాన్స్ కి షాక్ తగిలింది.పోస్టర్ కాదు కాని సినిమా పోస్ట్ పోన్ అంటూ వచ్చిన ఎనౌన్స్ మెంట్ కి మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది.

 Acharya Again Postpone Mega Fans Pongal Shock-సంక్రాంతికి ఆచార్య షాక్.. పోస్టర్ వస్తుందనుకుంటే పోస్ట్ పోన్ న్యూస్ వచ్చింది..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం ల బాటలో ఆచార్య కూడా వాయిదా బాట పడింది.మరి ఈ సినిమాల కొత్త రిలీజ్ డేట్ లు ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.

#Acharya #Radheshyam #Acharya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube