అచ్చెన్నకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ? ఇదే సరైన సమయమా ?  

Acham Naidu Will Be The Ap Tdp President - Telugu Acham Naidu, Ap Tdp President, Chandrababu Naidu, Kala Venkat Rao, ఏపీ టీడీపీ

ఏపీ టీడీపీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు మళ్లీ తెర మీదకు వచ్చాయి.కొద్ది రోజుల క్రితం ఏపీ టిడిపి అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి టీడీపీలో హడావుడి జరిగింది.

Acham Naidu Will Be The Ap Tdp President

అయితే అప్పుడు అమరావతి వ్యవహారంలో తీరికలేకుండా చంద్రబాబు ఉండడం.ఆ తరువాత ఐటీ దాడులు, ఇలా ఎన్నో ఇబ్బందులు ఏర్పడడంతో ఎంపిక వాయిదా పడింది.

ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పనితీరు అంతంత మాత్రంగా ఉండడం, ఆయన ఉన్నా లేనట్టుగా వ్యవహారాలు నడుపుతుండడంతో బాబు అసంతృప్తితో ఉన్నారు.

ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నా, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు అధికార పార్టీ మీద విమర్శలు చేసే విషయంలో మెతక వైఖరి అవలంబించడం, పార్టీలోనూ ఎవరూ ఆయన్ను పెద్దగా లెక్కచేయకపోవడం, ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి నియామకం చేపట్టాలని చంద్రబాబు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం అధికార పార్టీ వైసిపి తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ గా చేసుకుని కేసుల్లో ఇరికించాలని చూస్తూ వేధింపులకు పాల్పడుతుండటంతో అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బలమైన వాయిస్ ఉన్న అచ్చెన్నాయుడిని రంగంలోకి దింపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అదీ కాకుండా పార్టీ ఇప్పుడు ఇంత కష్టకాలంలో ఉన్నా నాయకులు ఎవరూ పెద్దగా స్పందించడం లేదని చంద్రబాబు భావిస్తున్నారు.అందుకే తన తరువాత అసెంబ్లీలోనూ, బయట అధికార పార్టీని అన్ని రకాలుగా అడ్డుకుంటూ, తన మాటలతో అధికార పార్టీని అడ్డుకుంటున్న అచ్చెన్నాయుడిని ఎంపిక చేస్తే తెలుగుదేశం పార్టీకి కొంతలో కొంత ఊరట కలిగించేలా ఆయన చేయగలరు అనే నమ్మకం బాబు లో ఉన్నట్లు సమాచారం.దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులతోనూ చర్చించినట్టు సమాచారం.

మరికొద్ది రోజుల్లోనే అచ్చెన్నకు ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

తాజా వార్తలు

Acham Naidu Will Be The Ap Tdp President-ap Tdp President,chandrababu Naidu,kala Venkat Rao,ఏపీ టీడీపీ Related....